టీడీపీలో ఎల్లో అలెర్ట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరికలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ ఉలికిపాటుకు గురవుతుంది. నిన్న మొన్నటి వరకూ ఫిరాయింపులు [more]

Update: 2019-10-12 11:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరికలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ ఉలికిపాటుకు గురవుతుంది. నిన్న మొన్నటి వరకూ ఫిరాయింపులు తాను ప్రోత్సహించనని జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీంతో తనతో్ పాటు గత ఎన్నికల్లో్ గెలిచిన ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బందులు పడాల్సిన పనిలేదని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. అందుకే జగన్ పాలన ఆరు నెలలు చూద్దామని తొలినాళ్లలో చెప్పిన చంద్రబాబు నెల రోజులు గడవకముందే దూకుడు స్టార్ట్ చేశారు.

జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…..

అయితే జగన్ ఇతర పార్టీల నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబు ఇప్పుడు డిఫెన్స్ లో్ పడిపోయారు. టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు వైసీపీ అగ్రనేతలతో్ టచ్ లో్కి వెళ్లిపోయారు. తోట త్రిమూర్తులు, జూపూడి ప్రభాకర్ ల చేరిక తర్వాత పెద్దయెత్తున టీడీపీ నేతలు తమ పార్టీలోకి వస్తారని వైసీపీ ప్రకటించడంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. జిల్లా పార్టీల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. పార్టీని వీడతారన్న అనుమానం ఉన్న నేతలకు చంద్రబాబు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

బీజేపీ వైపు వెళ్లినా…..

ఇప్పటి వరకూ టీడీపీ నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. అయితే వారంతా ఎన్నికల సమయానికి తిరిగి టీడీపీలోకి వస్తారన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. కేసులు, వ్యాపారాలకు భయపడి వారు బీజేపీ వైపు వెళ్లారని చంద్రబాబు సర్ది చెప్పుకున్నారు.నలుగురు రాజ్యసభసభ్యులు బీజేపీలోకి వెళ్లినా చంద్రబాబు పెద్దగా కంగారు పడలేదు. అయితే తాజాగా వైసీపీలోకి నేతలు క్యూ కడుతుండటంతో చంద్రబాబులో హైరానా మొదల యిం దంటున్నారు. అధికార వైసీపీలోకి వెళ్లడం ప్రారంభమయితే పార్టీకి కొంత ఇబ్బందేనని గ్రహించారు.

ఎమ్మెల్యేలు కూడా….

ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కొందరు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం చంద్రబాబుకు అందింది. తాము రాజీనామా చేసి పార్టీలోకి వస్తామని కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో రాయబారాలు నడుపుతున్నట్లు తెలియడంతో వారితో చంద్రబాబు వ్యక్తిగతంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. వారి రాజకీయ భవిష్యత్ పై భరోసా ఇవ్వాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే తన నాయకత్వంపైనే అపనమ్మకం ఏర్పడుతుందని భావించిన చంద్రబాబు వారిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఎంతమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News