రౌండ్ అందుకేనటగా
పులివెందుల – కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో నేతల పర్యటనలకు ప్రచారాలు అక్కరలేదు. ఎందుకంటే రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల అధినేతల నియోజకవర్గాలు కావడంతో అక్కడి ప్రజలు [more]
పులివెందుల – కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో నేతల పర్యటనలకు ప్రచారాలు అక్కరలేదు. ఎందుకంటే రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల అధినేతల నియోజకవర్గాలు కావడంతో అక్కడి ప్రజలు [more]
పులివెందుల – కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో నేతల పర్యటనలకు ప్రచారాలు అక్కరలేదు. ఎందుకంటే రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల అధినేతల నియోజకవర్గాలు కావడంతో అక్కడి ప్రజలు తమ నేతలు అందుబాటులో లేకున్నా వారు చేసే అభివృద్ధి అనుబంధాల కారణంగా నేరుగా అసెంబ్లీకి మంచి మెజారిటీ తో గెలిపించడం సంప్రదాయంగా వస్తుంది. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లో మెజారిటీ గణనీయంగా తగ్గింది. నాటి నుంచి టిడిపి లో ఆందోళన పెరిగిపోగా కొద్దిగా శ్రమిస్తే చంద్రబాబును అక్కడే ఓడించేయొచ్చేమో అనే ఆత్మవిశ్వాసం వైసిపి లో పెరిగింది. అలా అనుకోవడం మొదలు చంద్రబాబు కంచుకోటపై నెమ్మదిగా ఫ్యాన్ పార్టీ దండయాత్ర మొదలు పెట్టేసింది.
వేడి పుట్టించిన వైసిపి సభ …
చంద్రబాబు ఇలాకాలో ఆ మధ్య వైసిపి భారీ బహిరంగ సభ పెట్టింది. ఈ సభలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసిపి నేతలు అంతా దుమ్మెత్తిపోశారు. గతంలో ఇదే తీరులో పులివెందులకు చంద్రబాబు టార్గెట్ చేసి వైసిపి అధినేత కడప జిల్లా లక్ష్యంగా రాజకీయాలు గట్టిగానే చేశారు. అది గుర్తించే వైసిపి అదే స్టయిల్ లో టిడిపి అధినేతపై సర్కార్ ఏర్పడిన నాటినుంచి గురి పెట్టేసింది. దాంతో ఎప్పుడో సంక్రాంతి పండగకు తప్ప తమ నియోజకవర్గం ముఖం చూడని చంద్రబాబు ఇప్పుడు ఏదో పని పెట్టుకుని కుప్పం రౌండ్ వేసే కార్యక్రమం మొదలు పెట్టాలిసి వచ్చింది. తాజాగా ప్రజాచైతన్య యాత్రలో కూడా కుప్పం లోనే చంద్రబాబు రెండు రోజులు పర్యటించడం చర్చనీయం అయ్యింది.
చుక్కలు చూపిస్తున్నారా … ?
నిజానికి గతంలో అయితే కుప్పం లో వెచ్చించే సమయం వేరే నియోజకవర్గంలో చంద్రబాబు కేటాయించేవారు. కానీ ముందునుంచి తన కోటను పటిష్టం చేసుకోకపోతే ప్రమాదమని గుర్తించే చంద్రబాబు కుప్పం టూర్ కి శ్రీకారం చుట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు టూర్ మొదలు కాకుండానే కుప్పంలో ఫ్లెక్సీ ల వివాదం చెలరేగింది. వైసిపి నేతలు కుప్పం అంతా జగన్ ఫ్లెక్సీలు తగిలించడంతో టిడిపి కి చంద్రబాబుకి స్వాగతం పలుకుతూ బ్యానర్ కట్టుకోవడానికి సైతం స్థలం లేకుండా పోయింది. దాంతో రెండు రోజులపాటు కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా అధికారుల చొరవతో సమస్యను సరిదిద్దారు. ఇవన్ని గమనిస్తే చంద్రబాబు ను సొంత నియోజకవర్గంలో చుక్కలు చూపించడానికి వైసిపి రాబోయే రోజుల్లో మరిన్ని వ్యూహాలు రచించడం ఖాయంగానే కనిపిస్తుంది. వీటిని టిడిపి అధినేత ఎలా ఎదుర్కొంటారో చూడాలి.