ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి అడుగు.. వివాదానికి కారణమవుతోందా? ఒక పక్క కేంద్రంలోని మోడీ సర్కారు, మరోపక్క రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ముప్పేట దాడులతో [more]
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి అడుగు.. వివాదానికి కారణమవుతోందా? ఒక పక్క కేంద్రంలోని మోడీ సర్కారు, మరోపక్క రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ముప్పేట దాడులతో [more]
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి అడుగు.. వివాదానికి కారణమవుతోందా? ఒక పక్క కేంద్రంలోని మోడీ సర్కారు, మరోపక్క రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ముప్పేట దాడులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయమా అనే చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం .. రాబోయే రోజుల్లో చంద్రబాబు కు ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో ప్రారంభించిన ఆపరేషన్.. రాబోయే రోజుల్లో మరింతగా పుంజుకునేందుకు సిద్ధమైంది.
బీజేపీ లోని కీలక నేతలు రాష్ట్రంలోని టీడీపీ నేతలపై దృష్టి పెట్టారు. వారిని తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా టీడీపీని బలహీన పరచాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. అంతకు మించి చంద్రబాబు కు అత్యంత సన్నిహితులు పార్టీ మారిపోయారు. ఇక, మరో పది నుంచి 12 మంది వరకు ఎమ్మెల్యేలను కూడా బీజేపీ లైన్‌లో పెడుతోంది. వీరిలో ప్రధానంగా వినిపి స్తున్న పేరు గంటా శ్రీనివాసరావు. ఆయన వెళ్తే.. ఆయన వెంట వెళ్లేందుకు మరో నలుగురు కూడా ఉన్నారని సమాచారం.
ఇలా మొత్తంగా కేంద్రంలోని బీజేపీ.. బాబుపై తీవ్రస్థాయిలో విజృంభించేందుకు రెడీ అయింది. దీని నుంచి నాయకులను కాపాడుకోవడం అనేది చంద్రబాబు నాయుడు కు ఇప్పుడున్న పరిస్థితిలో విషమ పరిస్థితే అని చెప్పకతప్పదు. అదేసమయంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం కూడా చంద్రబాబును వీలైనంత వరకు భ్రష్టు పట్టించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అవినీతిని తవ్వి తీసేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అంటే, రాబోయే రోజుల్లో చంద్రబాబు పాలన ఎంత అవినీతి మయంగా మారిందో.. టీడీపీ వాళ్లు ఎన్ని అక్రమాలు చేశారో.. అంటూ.. రుజువులు సాక్షాలతో సహా.. జగన్.. ప్రజల ముందు ఉంచనున్నారు.
ఇక, అదే సమయంలో నైతికంగా బాబును దెబ్బతీసేందుకు వాటిపై విచారణలు వేయనున్నారు. ఇలా. మొత్తానికి చంద్రబాబు నాయుడు కు అటు కేంద్రంలోని బీజేపీ నుంచి రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం నుంచి కూడా తీవ్ర యుద్ధమే ఎదురు కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో.. లేదా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాదిరిగా.. ఇబ్బందుల్లో కూరుకుపోతారో చూడాలి.