కల చెదిరింది … కథ మారింది

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం పై హర్షాతిరేకాలు ఇంకా పూర్తిగా అనుభవించకుండానే టిడిపి కి మింగుడు పడని నిర్ణయం గవర్నర్ ప్రకటించేశారు. అమరావతి కల చెదిరి పోయి [more]

Update: 2020-08-01 02:00 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం పై హర్షాతిరేకాలు ఇంకా పూర్తిగా అనుభవించకుండానే టిడిపి కి మింగుడు పడని నిర్ణయం గవర్నర్ ప్రకటించేశారు. అమరావతి కల చెదిరి పోయి ఇప్పుడు కథ పూర్తిగా మారిపోయింది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ హరిభూషణ్ ఆమోదం కరోనా ను మించి రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంలో అల్లకల్లోలం సృష్ట్టించింది. దీని నుంచి ఎలా బయటపడాలో అనే ఆలోచనతో పసుపు ఛానెల్స్ తమ పార్టీ అనుకూల మేధావులతో అరుపులు కేకలతో చర్చలు మొదలు పెట్టాయి. ఇక అధికారపార్టీ అనుకూల ఛానెల్స్ లో ఇకపై ఎపి లో అద్భుతాలు జరగబోతున్నాయంటూ సంబరాలతో తమ బాకా తాము ఊదేస్తున్నాయి.

చిద్విలాసం తో కమలం …

నాడు చంద్రబాబు అమరావతి ని రాజధాని ప్రకటించి బాహుబలి డిజైన్స్ ఇచ్చినప్పుడు బిజెపి చప్పట్లు కొట్టింది. అంతేకాదు ప్రధాని సైతం పవిత్ర, మట్టి నీరు ఇచ్చి ఆ తరువాత కొంత నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు జగన్ సర్కార్ మూడు రాజధానులకు గవర్నర్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ పై కూడా కమలనాధులు రాజ్యాంగ వ్యవస్థలపై తమకు గౌరవం ఉందని ఇందులో కూడా తాము జోక్యం చేసుకోలేమని ఈ వ్యవహారం తమపై రుద్దాలని టిడిపి దాని మీడియా ప్రయత్నాలు చేయడాన్ని ఖండించడం గమనార్హం. రాష్ట్ర పార్టీగా అమరావతి లో రాజధాని, రైతులకు న్యాయం జరగాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొంది. వాస్తవానికి బిజెపి తొలి నుంచి ఇదే చెప్పింది కూడా. బాబు ప్రకటించినప్పుడు కేంద్రం రాజధాని అంశంలో జ్యోక్యం చేసుకోలేదని ఇప్పుడు ఎలా చేసుకుంటుందన్నది ఆ పార్టీ వాదన.

వారికి కోర్టులే దిక్కా …

ఈ నేపథ్యంలో అమరావతి పై పోరాటం చేస్తున్న వారికి న్యాయస్థానం ఒక్కటే దారిగా కనిపిస్తుంది. అటు తెలుగుదేశం నిండా ముంచింది. ఇటు అధికారంలో ఉన్న వైసిపి తమ గోడు పట్టించుకున్నది లేక లిటిగేషన్ లో ఇరుక్కున్నారు అమరావతి రైతులు. దాంతో ఇప్పుడు రాజకీయ పక్షాలను నమ్ముకుంటే ఎలాంటి ప్రయోజనం లేదన్నది వారిలో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు తో పోరు బాట ఏ తీరం చేర్చకపోగా పూర్తిగా నష్టపోతామన్నది ఆందోళనకారుల్లో కొందరు సర్కార్ తో చర్చలే శరణ్యం అని చూస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి త్రి రాజధాని వ్యవహారం లో భవిష్యత్తు లో ఏమి జరగనున్నది అన్నది తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు మరోసారి తెరతీసింది.

Tags:    

Similar News