బాబు చేతులెత్తేసినట్లేనా? చెప్పిందే చెబితే?

“నేను రెండు రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తా. ప్రజల్లో చైతన్యం తెస్తా. కేంద్రం రాజధాని తరలింపు అడ్డుకోవాలి” అంటూ వైసిపి పై సవాల్ విసిరి సమయం [more]

Update: 2020-08-06 08:00 GMT

“నేను రెండు రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తా. ప్రజల్లో చైతన్యం తెస్తా. కేంద్రం రాజధాని తరలింపు అడ్డుకోవాలి” అంటూ వైసిపి పై సవాల్ విసిరి సమయం ఇచ్చి డెడ్ లైన్ ముగిశాక చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే ఈ విషయంలో ఇక తెలుగు దేశం పార్టీ చేతుల్లో ఏమి లేదని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లే అయ్యిందన్న విమర్శలు వినవస్తున్నాయి. దాంతో అమరావతి లోనే రాజధాని ఉంచడం తన వల్ల కాదని చంద్రబాబు చేతులు ఎత్తేసినట్లు క్లియర్ అయిందన్న విశ్లేషణలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.

ఉపోద్ఘాతాలతో పని జరుగుతుందా …?

రోజూ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు చెప్పిందే చెప్పుకుంటే కంఠశోషే మిగులుతుందని సొంత పార్టీ లోనే తమ్ముళ్ళు కొందరు నీళ్ళు నములుతున్నారు. కనీసం ప్రజాక్షేత్రంలోకి లోకేష్ ని అయినా పంపాలని వారు కోరుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎపి లోని 13 జిల్లాల్లో ప్రజల మద్దత్తు కూడగట్టడంతో పాటు పార్టీ క్యాడర్ ను పటిష్టం చేయడానికి చినబాబు పర్యటించాలిసిన ఆవశ్యకత ఉందన్న మాట వినవస్తుంది.

కరోనా సోకుతున్నా….

కరోనా విజృంభణ ఉన్నా పలువురు నేతలకు వైరస్ సోకుతున్నా వైసిపి మంత్రులు, ఎమ్యెల్యేలు, నేతలు ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. అయితే ఆరునెలలుగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధినేతలు హోమ్ క్వారంటైన్ లో ఎంతకాలం ఉంటూ జూమ్ ద్వారా పోరాటం అంటే ఎలా అన్నది వారి బాధ. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పిందే చెబుతారు. అంతకు మించి కొత్త దనం ఏముంటుందన్న చర్చ పార్టీలోనే జరుగుతుంది. అయితే చంద్రబాబు తమ్ముళ్ళ వేదన ఎంతవరకు వింటారో చూడాలి.

Tags:    

Similar News