అక్కడ మాత్రం బాబు సైలెంట్ ? రీజన్ అదేనా ?

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ రైతులకు మీటర్లు బిగించే అంశంపైనే నడుస్తుంది. ఉచిత విద్యుత్తు ను దశలవారీ ఎత్తివేసేందుకు వైసిపి సర్కార్ ఈ విధానం తీసుకువస్తుందని [more]

Update: 2020-09-05 06:30 GMT

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ రైతులకు మీటర్లు బిగించే అంశంపైనే నడుస్తుంది. ఉచిత విద్యుత్తు ను దశలవారీ ఎత్తివేసేందుకు వైసిపి సర్కార్ ఈ విధానం తీసుకువస్తుందని టిడిపి రొటీన్ గానే దాడి మొదలు పెట్టేసింది. ప్రధాన విపక్షంగా ఈ అనుమానం వారు వ్యక్తం చేయడంలో కానీ ఆరోపించడంలో కానీ ఎలాంటి దోషం లేదు. కేంద్రం లోని మోడీ సర్కార్ కొత్తగా తీసుకురానున్న విద్యుత్ సంస్కరణల నేపథ్యంలో రైతులకు ఉచిత విద్యుత్తు అందించడం లో రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులను సర్కార్ ఎదుర్కొవాలిసి ఉంటుంది. దానితో బాటు మీటర్లు బిగించడం వల్ల రుణ వెసులుబాటు లభించనుంది. అదీగాక రైతులకు నేరుగా విద్యుత్ బిల్లుల సొమ్ము జమ చేయడం ద్వారా వారికి ఏ మేరకు లబ్ది చేస్తున్నాం అని సర్కార్ చెప్పుకునే వీలు చిక్కుతుంది. ఇన్ని లాభాలు ఉండటంతో జగన్ ప్రభుత్వం తాము అనుకున్న విధంగానే అడుగులు ముందుకు వేస్తుంది.

టిడిపి నేతలు రచ్చ చేస్తున్నా …?

విపక్షంలో ఎవరు ఉన్నా సర్కార్ చేసే పని ఏదైనా విమర్శలు ఆరోపణలు చేయడం సాధారణమే. అయితే ఈ మీటర్ల బిగింపు అంశం పై మాత్రం టిడిపి లో అన్ని స్థాయిల్లో అంతా నోరెత్తుతున్నారు. కానీ అధినేత చంద్రబాబు దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. గతంలో వైఎస్ ఈ హామీ ఇచ్చినప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు చేసిన కామెంట్స్ ఆయనకు ఇప్పుడు అడ్డుపడ్డాయా ? లేక సంస్కరణలకు అనుకూలంగా ఉండే బాబు గతంలో జరిగిన బషీర్ బాగ్ కాల్పుల నుంచి అన్నిటికి జవాబు చెప్పాల్సి ఉంటుందనే సైలెంట్ అయ్యారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అందుకేనా మౌనం…?

ఇప్పటికే మంత్రి కొడాలి నాని వంటివారు బషీర్ బాగ్ కాల్పుల్లో రైతులను చంద్రబాబు సర్కార్ కాల్చేసిందని తనదైన శైలిలో దాడి మొదలు పెట్టారు. నాని కూత మొదలు పెట్టారు కనుక వెనుకే వైసిపి శ్రేణులన్నీ టిడిపి వారి మీద కాక నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై మరింత రచ్చ అసలుకే ఎసరు గా చంద్రబాబు భావించే మౌనం దాల్చారా లేక మరేదైనా వ్యూహమా అన్నది చూడాలి.

Tags:    

Similar News