ఈ రచ్చ టిడిపి కి మైనస్ కానుందా ..?
ఏపీ లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇకపై ఉండదని టిడిపి గట్టిగానే వాయిస్ పెంచింది. కొద్ది రోజులు ఈ అంశంపై మౌనం వహించిన చంద్రబాబు ఇక తప్పనిసరై [more]
ఏపీ లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇకపై ఉండదని టిడిపి గట్టిగానే వాయిస్ పెంచింది. కొద్ది రోజులు ఈ అంశంపై మౌనం వహించిన చంద్రబాబు ఇక తప్పనిసరై [more]
ఏపీ లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇకపై ఉండదని టిడిపి గట్టిగానే వాయిస్ పెంచింది. కొద్ది రోజులు ఈ అంశంపై మౌనం వహించిన చంద్రబాబు ఇక తప్పనిసరై జూమ్ లోకి వచ్చి వైసిపి ఆడిన మాట తప్పుతుందని విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. అక్కడితో ఆగకుండా ఇది ఎన్టీఆర్ హయాంలో మొదలు పెట్టిందంటూ చెప్పి కట్ చేసి అలా రాష్ట్రంలో 18 లక్షలమందికి తామే లబ్ది చేకూర్చినట్లు గొప్పలకు పోయారు. ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు అమలు కోసం అధికారంలో ఉన్నప్పుడు సై అన్న చంద్రబాబు తమ సర్కార్ ఉచిత విద్యుత్ తెచ్చినట్లు బిల్డప్ ఇవ్వడంతో ఇప్పుడు జగన్ సర్కార్ ముప్పేట దాడి మొదలు పెట్టింది. చంద్రబాబు హయాంలో రైతులపై జరిగిన దాడులను గుర్తు చేస్తూ విపక్ష నేతను డిఫెన్స్ లో పడేస్తుంది.
కాల్దారి, బషీర్ బాగ్ మర్చిపోయారా …?
విద్యుత్ చార్జీలపై గతంలో రైతులు ఉద్యమిస్తే కాల్దారి, బషీర్ బాగ్ లలో కాల్చి చంపింది ఎవరు అంటూ వైసిపి మంత్రులు చంద్రబాబు ను ప్రశ్నిస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ అడిగిన పాపానికి రైతులకు లాఠీ దెబ్బలను రుచి చూపించింది చంద్రబాబు కాదా అంటూ చరిత్ర పురాణం లోకి వైసిపి వెళ్ళింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ అంతా ఇదే అంశంపై చంద్రబాబు ను టార్గెట్ చేసి తిట్టిపోశారు. వాస్తవానికి ఈ అంశంపై ఎక్కువ చర్చ జరిగితే టిడిపి డిఫెన్స్ లో పడక తప్పదు. గతంలో వైఎస్ ఆర్ ఉచిత విద్యుత్ ప్రకటించినప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి చేసిన వ్యాఖ్యలు ఆయనకు ముఖ్యమంత్రి పీఠాన్ని దూరం చేసేశాయి.
ఉచిత విద్యుత్ కి వైఎస్ ట్రేడ్ మార్క్ …
ఉచిత విద్యుత్ కి వైఎస్ ట్రేడ్ మార్క్ అయిపోయారన్నది అందరికి తెలిసిందే. ఆయన మొదలు పెట్టిన పథకాన్ని తరువాత చంద్రబాబు కానీ, జగన్ ప్రభుత్వాలు తీసివేయలేని పరిస్థితి ఉంది. అలాంటి వ్యహారంపై నోరు మెదపడం కన్నా రైతులకు ఈ అంశంలో అన్యాయం జరిగితే ఉద్యమిస్తామని చంద్రబాబు చెప్పి ఉంటే బాగుండునని టిడిపి శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. రైతులు వినియోగించే విద్యుత్ పై ప్రభుత్వమే నగదు వారి ఖాతాల్లోకి జమ చేస్తుందని పదేపదే చెబుతుంది కూడా. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా వైసిపి ఓటు బ్యాంక్ కి భారీ చిల్లు తప్పదు. ఆ విషయం జగన్ సర్కార్ కి తెలుసు. కానీ టిడిపి ప్రతీ అంశంపై రాజకీయం చేయడానికే చూస్తూ ఉండటం తో కొన్ని అంశాలు హాస్యాస్పదం గా మారిపోతున్నాయి.