ముందుకు దూకి ముక్కు గుద్దిచ్చుకోవడమేగా?

ఎన్నికలు తన్నుకువచ్చేశాయి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా అగేది కాదన్నది వెనకటి సామెత. ఎన్నికలు వచ్చినా కూడా అంతేనన్నది ఇప్పటి సామెత. ఇలా అనూహ్యంగా అకస్మాత్తుగా వచ్చిపడిన [more]

Update: 2020-03-09 11:00 GMT

ఎన్నికలు తన్నుకువచ్చేశాయి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా అగేది కాదన్నది వెనకటి సామెత. ఎన్నికలు వచ్చినా కూడా అంతేనన్నది ఇప్పటి సామెత. ఇలా అనూహ్యంగా అకస్మాత్తుగా వచ్చిపడిన ఎన్నికలు పసుపు శిబిరాన్ని తెగ పరేషాన్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా పార్టీ ముందుకు కదిలేలా లేదు. మరో వైపు చూసుకుంటే తమ్ముళ్ళు తడిగుడ్డ వేసుకుని ఎక్కడికక్కడ పడుకున్నారు. అసలు ఎన్నికల్లోనే ఓడిపోయాక ఈ కొసరు ఎన్నికలు మాకేలా? అయినా గెలిచేటంత సీన్ కూడా లేదుగా. ఎందుకు ముందుకు దూకి ముక్కు గుద్దించుకోవడం అని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారట.

తడిసిమోపెడు…..

ఎన్నికలు అంటేనే భారీ బడ్జెట్ సినిమా. ఇపుడు పల్లెటూరు వార్డు మెంబర్ పోస్ట్ కి అయినా కూడా లక్షలు తీయాల్సివస్తోంది. దాంతో ఎన్నికలు అంటేనే జడుసుకునే పరిస్థితి ఉంది. ఓ వైపు అధికార పార్టీ దూకుడు మీద ఉంది. నిన్ననే బంపర్ మెజారిటీతో గెలిచిన సంబరం ఇంకా అలాగే ఉంది. దానికి తోడు ఎలాగైనా అన్ని సీట్లూ కొట్టి తీరాలన్న ఆలోచనలో దూకుడుగా ముందుకు పోతోంది. ఈ టైంలో ఎదురువస్తే ఇబ్బందే. ఎటూ కాకుండా పోతారు. అందుకే టీడీపీ నేతలు కూడా ఖర్చుకు వెనకాడుతున్నారు. ఎంత పెట్టుకున్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని భావిసున్నారుట.

బాబు అటేనా…?

ఇక బాబు ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయా. అంటే ఆయన మదిలో భావాలను చదివి చెప్పే మీడియా మోతుబరులు, విశ్లేషకులు అనబడే పచ్చ పార్టీ శ్రేయోభిలాషులు ఎన్నికల జోలికి ఇపుడు అసలు పోవద్దని బాబుకు గట్టిగానే చెబుతున్నారుట. ఇపుడు ఎన్నికలను అన్నీసరిచూసుకుని మరీ జగన్ పెడుతున్నారు.ఈ ఎన్నికలు జగన్ అనుకున్నట్లే జరుగుతాయి. పోటీ ఇచ్చి ఓడిపోతే పరువు పోవడం కాదు, టీడీపీయే మొత్తానికి పోతుంది. ఇప్పటికే పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఈ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వస్తే మిగిలిన వారు కూడా జారుకుంటే అసలుకే ఎసరు వస్తుందని హెచ్చరిస్తున్నారుట.

నిందలేసి మరీ…..

ఎన్నికలు కావు ఇవి, వట్టి ఫార్స్. ఓ పధ్ధతీ పాడూ లేదంటూ సర్కార్ మీద బండలేసి, నిందలేసి తప్పుకోవాలని పార్టీ భవిష్యత్తు గురించి బాధపడేవారు బాబుకు సూచిస్తున్నారుట. ఎంత కష్టపడినా జనాల్లో ఇప్పటికైతే పెద్దగావ్యతిరేకత లేదు, పైగా సంక్షేమ పధకాలు జనాలకు జగన్ జాగ్రత్తగా చేరవేశాడు. అందువల్ల వారు అటే మొగ్గు చూపుతారు. అధికార యంత్రాంగం మొత్తం జగన్ కి హెల్ప్ గా ఉంటుంది. దాంతో గెలుపు వారికి సులువు అవుతుంది. కాదూ కూడదని ముగ్గులోకి దిగితే ముఖం పచ్చడవుతుందని అంటున్నారుట. మరి తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు అంటేనే మొదటి నుంచి కొంత జంకు ఉంది. అయినా కుర్చీ దిగిపో, అసెంబ్లీ రద్దు చేయ్ అంటూ పెద్ద సవాళ్ళు చేసి ఇపుడు చేతులు ముడుచుకుని కూర్చుటే పరువు ఉంటుందా అని ఆలోచిస్తున్నారుట. చూడాలి మరి. టీడీపీ నేతలు చివరికి అస్ర సన్యాసం చేస్తారా. బరిలోకి దూకుతారా అన్నది.

Tags:    

Similar News