టీడీపీలో అభ‌ద్రత‌.. తండ్రీ కొడుకుల చేష్టల కారణంగానే ?

తాజా ప‌రిణామాల్లో భాగంగా మ‌రోసారి.. చంద్రబాబు కార్నర్‌గా సోష‌ల్ మీడియాలో కామెంట్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు భ‌య‌ప‌డుతున్నారా? అనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. [more]

Update: 2021-02-06 14:30 GMT

తాజా ప‌రిణామాల్లో భాగంగా మ‌రోసారి.. చంద్రబాబు కార్నర్‌గా సోష‌ల్ మీడియాలో కామెంట్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు భ‌య‌ప‌డుతున్నారా? అనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎందుకంటే. తాజాగా వైసీపీ కీల‌క నేత, మంత్రి కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స‌రే! స‌హ‌జ ధోర‌ణిలో నాని ఎప్పుడూ.. బాబుపై విమ‌ర్శలు చేస్తారు క‌నుక .. వాటికి పెద్దగా ఎవ‌రూ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అయితే.. నాని చేసిన వ్యాఖ్యల్లో ఒక‌టి మాత్రం పార్టీపై తీవ్ర ప్రభావం చూపించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మాజీ మంత్రి అఖిల ప్రియ‌.. హ‌ఫీజ్ పేట భూముల వివాదంలో జ‌రిగిన కిడ్నాప్ కేసులో ఇరుక్కుని జైల్లో ఉన్నారు.

అఖిలప్రియ విషయంలో…..

క‌ర్నూలులో గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్న టీడీపీ నాయ‌కురాలిగా.. మాజీమంత్రిగా కూడా అఖిల ప్రియ గుర్తింపు పొందారు. పార్టీలోనూ దూకుడుగా ఉన్నారు. అలాంటి ఆమెను అరెస్టు చేస్తే.. చంద్రబాబుకానీ, ఆయ‌న త‌న‌యుడు, మాజీ మంత్రి లోకేష్ కానీ.. ఎక్కడా నోరు విప్పలేద‌నేది మంత్రి నాని ఆరోప‌ణ‌. దీనిలో నిజం కూడా ఉంది. అఖిల‌ను అరెస్టు చేసి.. ప‌ది రోజులు అయిన‌ప్పటికీ.. ఇప్పటి వ‌ర‌కు చంద్రబాబు స్పందించ‌లేదు. క‌నీసం ఎందుకు అరెస్టు చేయాల్సి వ‌చ్చిందో పార్టీ త‌ర‌ఫున కూడా ప్రక‌ట‌న జారీచేయ‌లేదు. పార్టీ ఏవిధంగా అండగా ఉంటుందో .. లేదా ఉండ‌దో.. కూడా ఆయ‌న చెప్పలేదు. ఈ ప‌రిణామాలు.. నిజానికి ఒక్క అఖిల ప్రియ‌కే ప‌రిమితం కాలేదు.

కొల్లు రవీంద్ర విషయంలో…..

చంద్రబాబు వైఖ‌రిని చూస్తే.. పార్టీలోని ఇత‌ర నేత‌లు కూడా భ‌య‌ప‌డుతున్నారు. హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జైలుకు వెళ్లిన‌ప్పుడు చంద్రబాబు ధీటుగా స్పందించారు. ఏపీ స‌ర్కారుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కానీ, ఇప్పుడు.. ఏపీకి చెందిన మంత్రి దూకుడుగా ఉండే మ‌హిళా నాయ‌కురాలు పొరుగు రాష్ట్రంలో అరెస్టయితే.. క‌నీసం చంద్రబాబు స్పందించ‌క‌పోవడం.. అక్కడి ప్రభుత్వానికి భ‌య‌ప‌డైనా అయి ఉండాలి.. లేదా.. మ‌రేదైనా కార‌ణం అయి ఉండాలి.

పార్టీలో చర్చ…..

ఈ ప‌రిణామం.. పార్టీలోని ఇత‌ర నేత‌ల‌పై ప్రభావం చూపిస్తోంది. పార్టీ కోసం అఖిల చాలానే చేసింది. అయినా.. ఇప్పుడు ఆమె అరెస్టయితే.. చంద్రబాబు ఆయ‌న త‌న‌యుడు క‌నీసం ప‌న్నెత్తి ప‌ల‌క‌రించే ప్రయ‌త్నం చేయ‌లేదు. రేపు మా ప‌రిస్థితి ఏదైనా అయితే కూడా ఇంతేక‌దా! అని ఎవ‌రికి వారు జాగ్రత్త ప‌డుతున్నారు. ఇది అంతిమంగా పార్టీని బ‌ల‌హీన ప‌రుస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News