జగన్ ను ఇలా ఇరకాటంలోకి నెట్టేస్తారా?

చంద్రబాబు ఏం చేసినా అందులో రాజకీయం ముడిపడి ఉండేలా చూసుకుంటారు. ప్రత్యర్థిని ఎటు అడుగులు వేయలేని పరిస్థితి ఆయన రాజకీయ చదరంగంలో ఎత్తులు వేయడంలో దిట్ట. తాజాగా [more]

Update: 2020-05-24 08:00 GMT

చంద్రబాబు ఏం చేసినా అందులో రాజకీయం ముడిపడి ఉండేలా చూసుకుంటారు. ప్రత్యర్థిని ఎటు అడుగులు వేయలేని పరిస్థితి ఆయన రాజకీయ చదరంగంలో ఎత్తులు వేయడంలో దిట్ట. తాజాగా అయన ఎపి కి వచ్చేందుకు సైతం ఇలాంటి ఎత్తు వేసి జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టేశారు. విశాఖ లో గ్యాస్ లీక్ దుర్ఘటనకు అనుమతి కోరుతూ ఆయన కేంద్రాన్ని అభ్యర్ధించినా ఇప్పుడు విమానాల రాకపోకలు మొదలు కావడంతో ఏపీకి వచ్చేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను అనుమతి కోరినా దానివెనుక రాజకీయం ఉందనేది అందరికి తెలిసిందే. ఇదేమి తప్పు కూడా కాదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు విశాఖ గ్యాస్ దుర్ఘటన బాధితులను పరామర్శించడం కానీ జిల్లాల్లో పర్యటించడం లోటు పాట్లు ఎత్తి చూపడం ఆయన బాధ్యత కూడా.

బాబు ను అనుమతిస్తే …

అలా చేస్తే గత రెండు నెలలుగా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండిపోయారనే విమర్శలు, ఆరోపణలకు సైతం చెక్ పడుతుంది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఆయన వాటిని పాటిస్తున్నారని ఇప్పటికే టిడిపి శ్రేణులు గట్టిగానే ప్రజల్లోకి తీసుకు వెళ్లాయి. చంద్రబాబు కూడా టెక్నాలజీ సాయంతో అటు పార్టీ శ్రేణులతోను ఇటు తన ప్రాణప్రదమైన మీడియా టచ్ లో ఉంటూ ప్రజల్లో నిత్యం ఉన్నట్లుగానే ఫోకస్ అయ్యారు.

జిల్లాల టూర్లకు…..

ఈ నేపథ్యంలో చంద్రబాబు మరో ప్రయత్నం మొదలు పెట్టారు. అయితే ఇది కూడా ఏపీ సర్కార్ కేంద్రం లాగే నో చెప్పే అవకాశమే ఉంది. బాబు రావడానికి ఎస్ చెబితే ఎపి రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. దాంతో మరికొంతకాలం ఆయనను హైదరాబాద్ లో ఉంచేందుకే వైసిపి సర్కార్ ప్రయత్నం చేస్తుంది. లేదా ఆయన అమరావతి వచ్చేందుకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ నుంచి ఏ జిల్లాకు అనుమతి లేకుండా వెళ్ళడానికి వీలు లేదనే షరతు విధించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో చంద్రబాబు ఎపి టూర్ ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News