బాబు డేర్ చేయాల్సిందే.. 1999 స్టెప్ వేయాల్సిందేనట

చంద్రబాబుకు జగన్ కి పోలిక పెట్టాల్సిందే. జగన్ నవ యువ నాయకుడు. దూకుడు ఉన్న మనిషి. రాజకీయం కూడా అయనది సెపరేట్ గా ఉంటుంది. అదే చంద్రబాబు [more]

Update: 2021-08-14 02:00 GMT

చంద్రబాబుకు జగన్ కి పోలిక పెట్టాల్సిందే. జగన్ నవ యువ నాయకుడు. దూకుడు ఉన్న మనిషి. రాజకీయం కూడా అయనది సెపరేట్ గా ఉంటుంది. అదే చంద్రబాబు తీసుకుంటే అవుట్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తారని పేరు. ఆయన ఎంతసేపూ సీనియర్ నాయకులను చుట్టూ పెట్టుకుని పార్టీ అంటే అదేనని నమ్ముతారు. కానీ కాలం మారిపోయింది. జనాల అభిరుచులు మారిపోయాయి. టీడీపీ మాత్రం నాలుగు పదుల వయసులో పడింది. ఆ పార్టీలో చూస్తే ఎంతసేపూ వృద్ధ నాయకులే కనిపిస్తారు. ప్రతీ ఎన్నికలకు ముందు కొత్త నాయకత్వాన్ని తీసుకువస్తానని చంద్రబాబు చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం ఎక్కడా లేదని సొంత పార్టీలోనే కాదు బయట కూడా చర్చగా ఉంది. ఇక ఒక‌రిద్దరు కొత్త నాయ‌కులు వ‌చ్చినా వారికి పార్టీలో వారి అభిప్రాయాల‌ను చెప్పే విష‌యంలో ఏ మాత్రం స్వేచ్ఛ ఉండ‌దు.

ఆ ధైర్యం ఉండాల్సిందే….

ఇక చంద్రబాబుకు 2024 ఎన్నికలు చావో రేవో అన్నట్లుగానే ఉంటాయనడంలో సందేహం లేదు. ఈసారి కనుక నెగ్గకపోతే టీడీపీ అస్థిత్వానికే ప్రమాదం అన్నది కూడా తెలిసిందే. మరి చంద్రబాబు 2024 ఎన్నికల్లో అభ్యర్ధుల విషయంలో విప్లవాత్మకమైన నిర్ణయాలే తీసుకోవాలి. లేకపోతే మాత్రం టీడీపీ జాతకం చూసుకోనవసరం లేదని అంటున్నారు. జగన్ అయితే డేరింగ్ గా అభ్యర్ధులను మార్చేస్తారు. వారి అసమ్మతిని అసలు పట్టించుకోరు. తానున్నాను, గెలిపించేందుకు జనాలు ఉన్నారు అన్న ధోరణి జగన్ ది. మరి అంతటి ఆత్మవిశ్వాసం చంద్రబాబు చూపించగలరా ? అన్నదే ఇక్కడ చర్చ.

అలాగయితే బెడిసి కొట్టడం….

చంద్రబాబు ఈ రోజుకీ తన పొలిట్ బ్యూరోలో సీనియర్లనే పెట్టుకున్నారు. వారితోనే అంతా అంటున్నారు. వారి సలహాలనే వింటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు మార్క్ యూత్ అంటే సీనియర్ల వారసులకు టికెట్లు ఇవ్వడమే అన్న మాట ప్రచారంలో ఉంది. అదే జరిగితే టీడీపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా చాలా నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాలే టీడీపీలో ఏలుతున్నాయి. రాజకీయాన్ని వారే శాసిస్తున్నారు. ఇది జనాలకు బోర్ కొట్టేసింది. ఎపుడు చూసినా అవే ముఖాలు, అవే వారసత్వాలు అంటే టీడీపీకి మొదటికే బెడిసికొడుతుందని అంటున్నారు.

1999 తరహాలో….

దానికి బదులుగా చంద్రబాబు అదే టీడీపీ లో కొత్తవారికి టికెట్లు ఇస్తే ఫలితాలు బాగుంటాయి అంటున్నారు. అంతే కాదు 1999 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు తటస్థులు విద్యావంతులు అంటూ ప్రయోగం చేశారు. అది సూపర్ సక్సెస్ అయింది. అలా చంద్రబాబు స్వచ్చమైన వారికీ, మచ్చ లేని వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తే ఫ్రెష్ లుక్ ఉంటుందని కూడా సూచనలు అందుతున్నాయి. కానీ చంద్రబాబు ఏమాత్రం సీనియర్ల వత్తిడికి తలొగ్గినా, వారసులకు టికెట్లు ఇచ్చినా 2024 లో వచ్చిన అవకాశాలని కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషణలు ఉన్నాయి. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి

Tags:    

Similar News