పాత నేతలయితే మునిగిపోయినట్లేనా?
వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావడం చంద్రబాబుకు అంత సులువు కాదు. ఏ నియోజకవర్గం చూసినా పాత నేతలే ఇప్పటికీ పెత్తనం చేస్తున్నారు. వీరిని మరోసారి బరిలోకి దింపితే [more]
వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావడం చంద్రబాబుకు అంత సులువు కాదు. ఏ నియోజకవర్గం చూసినా పాత నేతలే ఇప్పటికీ పెత్తనం చేస్తున్నారు. వీరిని మరోసారి బరిలోకి దింపితే [more]
వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావడం చంద్రబాబుకు అంత సులువు కాదు. ఏ నియోజకవర్గం చూసినా పాత నేతలే ఇప్పటికీ పెత్తనం చేస్తున్నారు. వీరిని మరోసారి బరిలోకి దింపితే టీడీపీ వైపు ప్రజలు చూడటం కష్టమే. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో చాలా మంది నేతలు ఒకటి, రెండు సార్లు గెలిచిన వారు కూడా ఉన్నారు. వీరందరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వక తప్పని పరిస్థితి. వైసీపీని తట్టుకోవాలంటే ఆర్థికంగా నిలబడాలంటే పాతనేతలే బెటర్. కొత్త నేతలను తీసుకొస్తే కొత్త తలనొప్పులు ఎదురయ్యే అవకాశముంది.
వందకు పైగా నియోజకవర్గాల్లో….
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాలుంటే వీటిలో దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలే ఇప్పటికీ ఇన్ ఛార్జులుగా ఉన్నారు. వాళ్లంతా మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ కొత్త తరాన్ని ఆహ్వానించకపోతే జనం చంద్రబాబు పార్టీ వైపు చూడరు. మొన్నటి ఎన్నికల్లో జగన్ కొత్త నేతలకు ఎక్కువగా అవకాశమిచ్చి సక్సెస్ అయ్యారు. ఆ ప్రయోగం చేయాలని చంద్రబాబుకు ఉన్నా అది ఆచరణలో సాధ్యం కాదు.
కొన్నిచోట్లే ప్రయోగం….
కొన్ని చోట్ల మాత్రం ఈ ప్రయోగం చంద్రబాబు చేస్తున్నారు. కానీ కేవలం రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లోనే కొత్తవారిని చంద్రబాబు ఇన్ ఛార్జులగా నియమించారు. అలాగే తమకు పట్టులేని జమ్మలమడుగు లాంటి చోట కూడా ఇదే ప్రయోగం చంద్రబాబు చేశారు. ఎస్సీ నియోజకవర్గాలైన తిరువూరుకు దేవదత్, యర్రగొండపాలెంకు ఎరిక్సన్ బాబులను నియమించారు. ఇక రిజర్వడ్ కాని నియోజకవర్గాల్లో మాత్రం కొత్త నేతలకు అవకాశం ఇచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై…
కొందరిపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కారణంగా వచ్చే ఎన్నికల్లో సీట్లను కోల్పోయే అవకాశముంది. పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా కరోనా కారణంగా ఏం చేయలేకపోయారన్న సింపతీ ఒకటి కన్పిస్తుంది. ఈ సింపతీని దెబ్బతీసి ఓటర్లను తన వైపు తిప్పుకోవాలంటే చంద్రబాబు కొత్త నేతలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఈ ప్రయోగం చేస్తారా? లేదా? అన్నది ప్రస్తుతానికి తెలికున్నా… ఆచరణలో మాత్రం కష్టసాధ్యమేనంటున్నారు.