chandrababu : ఖాళీగా ఉంటున్నారా? కావాలనే చేస్తున్నారా?

తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు దాదాపు మూడు దశాబ్దాల నుంచి నాయకత్వం వహిస్తున్నారు. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు విభజిత రాష్ట్రంలోనూ టీడీపీ ఈ మాత్రం ఉందంటే [more]

Update: 2021-09-22 03:30 GMT

తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు దాదాపు మూడు దశాబ్దాల నుంచి నాయకత్వం వహిస్తున్నారు. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇటు విభజిత రాష్ట్రంలోనూ టీడీపీ ఈ మాత్రం ఉందంటే చంద్రబాబు మాత్రమే కారణం. చంద్రబాబు వ్యూహాలు, పరిపాలన తీరు ఆయనను మరల మరల ముఖ్యమంత్రిని చేశాయి. ఫలితంగా పార్టీ కూడా బలోపేతం అయింది. అయితే చంద్రబాబు ఎప్పుడూ ఖాళీగా ఉండరు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఆయన బిజీగానే ఉంటారు.

గతంలో అలా…

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా గంటల తరబడి మీడియా సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తారు. కానీ చంద్రబాబు గత కొద్ది రోజుల నుంచి మీడియా ముందుకు రావడం లేదు. కేవలం ట్వీట్లకు, ప్రెస్ నోట్లకు మాత్రమే పరిమితమవుతున్నారు. గత ఆరు నెలల నుంచి చంద్రబాబు జూమ్ మీటింగ్ లకే పరిమితమవుతున్నారు. అలాగని పార్టీ నేతలతో దూరంగా ఉండటం లేదు. నిత్యం టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ లతో టచ్ లో ఉంటున్నారు.

జనంలోకి వెళ్లేందుకు….?

ఇక జనంలోకి వెళ్లేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు ఆ తర్వాత జిల్లాల పర్యటనలు కూడా చేయలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలో నేరుగా పాల్గొంటారని అందరూ భావించారు. కానీ ఆయన అన్ని కార్యక్రమాలకు చంద్రబాబు దూరంగా ఉంటున్నారు. కరోనా తగ్గినా ప్రజల్లోకి రాకపోవడానికి కారణాలపై పార్టీలో చర్చ జరుగుతుంది.

లోకేష్ కోసమేనా?

చంద్రబాబుకు వయసు పైడింది. దీంతో ఆయన పార్టీ బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి లోకేష్ ను జనంలోకి పంపే ప్రయత్నంలో పడ్డారు. అందుకోసమే తాను టూర్లకు దూరంగా ఉంటున్నారు. జిల్లాల పర్యటనలు తగ్గించారు. మీడియా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. లోకేష్ ను ఫోకస్ చేసేందుకు చంద్రబాబు తనను తాను రాజకీయంగా కుదించుకుంటున్నట్లే కనపడుతుంది.

Tags:    

Similar News