Chandrababu : ముందు.. ముందు.. భారీ టాస్క్ లే…?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్లిష్ట సమయం. రాజకీయంగా ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించడం అంత సులువు కాదు. పార్టీని [more]

Update: 2021-09-26 15:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్లిష్ట సమయం. రాజకీయంగా ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించడం అంత సులువు కాదు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు కోల్పోయిన ఓటు బ్యాంకును కూడా తిరిగి పార్టీ వైపు మళ్లించాలి. ఇవన్నీ చంద్రబాబుకు ముందున్న టాస్క్ లే. తొలుత నాయకులను, క్యాడర్ ను యాక్టివ్ చేయాలి. తర్వాత ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టాలి.

ఖర్చు చేసేందుకు….

గతంలో అధికారంలో ఉన్న వాళ్లు తమ నియోజకవర్గంలో సయితం పార్టీ కోసం ఖర్చు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఆర్థికంగా తాము గత ఎన్నికల్లో నష్టపోయామని చెప్పి తప్పించు కుంటున్నారు. అనేక నియోజకవర్గాల నుంచి ద్వితీయ శ్రేణి నేతలు తమను పట్టించుకోవడం లేదని నేరుగా కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధానంగా రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లా నుంచి ఈ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.

ద్వితీయ శ్రేణి నేతలకు వల…

ఇటీవల పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించినా వైసీపీ సాధించిన ఫలితాల ప్రభావం పార్టీ పై పడిందనే ఖచ్చితంగా చెప్పాలి. ద్వితీయ శ్రేణి నేతలను మాజీ ఎమ్మెల్యేలు పట్టించుకోక పోతుండటంతో వారు వైసీపీ వైపు చూస్తున్నారు. వైసీపీ నేతలు కూడా వారికి కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రధాన నేతలకన్నా ద్వితయ శ్రేణి నేతలను పార్టీలోకి తీసుకురావాలని జగన్ ఆ పార్టీ నేతలకు ఆదేశాలివ్వడంతో వారిని కాపాడుకునే ప్రయత్నం చంద్రబాబు చేయాల్సి ఉంది.

వారితో నేరుగా…..

కేవలం స్థానిక నాయకత్వంపై ఆధారపడితే సరిపోదంటున్నారు. ఇప్పటికే మాజీలు అయిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని వదిలేసి వ్యాపారాలను చూసుకుంటున్నారు. అలా కాకుండా ముఖ్యమైన ద్వితయ శ్రేణి నేతలతో చంద్రబాబు జిల్లాల వారీగా సమావేశాలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇన్ ఛార్జులతో కాకుండా నేరుగా వారితో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకోవాలని భావిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు ముందు ముందు పెద్ద టాస్క్ లే ఉన్నాయని చెప్పకతప్పదు.

Tags:    

Similar News