Chandrababu : కుప్పంలో కొంప ముంచుతుంది వీళ్లేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితిని పక్కన పెడితే తన సొంత నియోజకవర్గమైన కుప్పం సమస్యగా మారింది. ముందు కుప్పంను సెట్ చేసుకోవాల్సిన [more]

Update: 2021-09-21 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితిని పక్కన పెడితే తన సొంత నియోజకవర్గమైన కుప్పం సమస్యగా మారింది. ముందు కుప్పంను సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఇప్పటి వరకూ కుప్పం నియోజకవర్గం నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. ఎనిమిదోసారికి కూడా చంద్రబాబు అక్కడి నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబుకు కుప్పం తలనొప్పిగా మారింది.

ఏరోజూ ఆందోళన లేకుండా….

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గం నుంచి ఎప్పుడూ పెద్దగా ఆందోళన చెందలేదు. నామినేషన్ వేసేందుకు కూడా అక్కడకు వెళ్లలేదు. ప్రచారాన్ని కూడా చేయలేదు. నామినేషన్, ప్రచార బాద్యతలన్నీ కుటుంబ సభ్యులే చూసుకునే వారు అయినా చంద్రబాబును తప్ప కుప్పం నియోజకవర్గం ప్రజలు ఎవరి వైపు చూడలేదు. కుప్పం నియోజకవర్గంలో తన తరుపున మనోహర్ అనే పీఏతో చంద్రబాబు వ్యవహారం నడిపేవారు.

గత ఎన్నికల్లో …..

అయితే గత ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం కుంగదీసింది. జగన్ వేవ్ అనాలో? చంద్రబాబుపై వ్యతిరేకత అనుకోవాలో? తెలియదు కాని అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ దారుణంగా పడిపోయింది. ఇది చంద్రబాబును మానసికంగా కుంగదీసింది. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం నియోజకవర్గం ప్రజలు దూరంగా పెడుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా పథ్నాలుగేళ్లు ఉన్నా తమ నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడాన్ని ప్రజలు బహుశ తప్పుపట్టి ఉండవచ్చు.

ఇన్ ఛార్జిలే దెబ్బతీశారా?

దీనికి తోడు చంద్రబాబు నియమించుకున్న ఇన్ ఛార్జిలు కూడా చేతివాటం చూపుతూ, అనుకూల వర్గాలను దూరం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే చంద్రబాబు ఇప్పుడు తక్షణం కుప్పం నియోజకవర్గం పై దృష్టి సారించాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులకు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం అలెర్ట్ కాకపోతే ఊహించని పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పుడు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారట. ఇకపై నెలలో రెండు రోజులు పర్యటించాలని డిసైడ్ అయ్యారట.

Tags:    

Similar News