Chandrababu : వారితో స్పెషల్ మీటింగ్స్.. అందుకేనట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనలను ప్రారంభించాలని నిర్ణయించారు. వచ్చే నెల దసరా తర్వాత చంద్రబాబు పర్యటనలు ఉండే అవకాశముంది. చంద్రబాబు ఎప్పుడూ ఖాళీగా ఉండరు. [more]

Update: 2021-09-29 15:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనలను ప్రారంభించాలని నిర్ణయించారు. వచ్చే నెల దసరా తర్వాత చంద్రబాబు పర్యటనలు ఉండే అవకాశముంది. చంద్రబాబు ఎప్పుడూ ఖాళీగా ఉండరు. జనం మధ్యలో ఉండేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తారు. కానీ కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కేవలం మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఆయన తిరుపతి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నంలలో పర్యటించారు. ఆ తర్వాత ఆయన విజయవాడ, హైదరాబాద్ కే పరిమితమయ్యారు.

వచ్చే నెలలోనే….

ఇప్పుడు జగన్ కూడా జనంలోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఆయన డిసెంబరు నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వచ్చే నెల చివరి నుంచి జిల్లా పర్యటలను చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒక్కొక్క జిల్లాకు రెండు రోజులు సమయం కేటాయించనున్నారు. కొన్ని చోట్ల రోడ్ షోలు, మరికొన్ని చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

నియోజకవర్గాల వారీగా….

దీంతో పాటు ప్రతి రోజు ఉదయం పార్టీ నేతలతో నియోజకవర్గాల వారీగా సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసిింది. జిల్లాల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించడంతో పాటు పార్టీ బలోపేతం పై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. చంద్రబాబు పర్యటనలు ప్రారంభమయ్యే దానికి ముందుగానే అన్ని నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించనున్నారు. నియోజకవర్గాల సమీక్షలతో పాటు ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

జిల్లాలో ముఖ్యులను….

ఇలా ఉండగా జిల్లాల పర్యటనలో ప్రముఖులను, తటస్థులను చంద్రబాబు కలవాలని నిర్ణయించారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజాసేవ చేస్తూ, ప్రజల్లో పలుకుబడి కలిగిన ముఖ్యులను చంద్రబాబు స్వయంగా వారి ఇంటికి వెళ్లి కలుస్తారని తెలిసింది. దీనివల్ల తటస్థులను తమ వైపునకు తిప్పుకోవచ్చని, వారి ప్రభావం కూడా ఎన్నికల్లో పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం మీద దసరా తర్వాత చంద్రబాబు జిల్లా టూర్లు ఉంటాయన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Tags:    

Similar News