Chandrababu : డోర్స్ ఓపెన్… ఎన్ని సీట్లయినా త్యాగం చేయడానికి?

ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్లకు ముందే రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటి నుంచే పొత్తుల కోసం పార్టీలు పరితపిస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ పొత్తుల కు తాపత్రయపడుతుంది. గత ఎన్నికల్లో ఒంటరి [more]

Update: 2021-10-04 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్లకు ముందే రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటి నుంచే పొత్తుల కోసం పార్టీలు పరితపిస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ పొత్తుల కు తాపత్రయపడుతుంది. గత ఎన్నికల్లో ఒంటరి ప్రయోగం విఫలం కావడంతో ఈసారి పొత్తులతోనే వెళ్లాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. తమంతట తామే పొత్తులకు వెళితే సీట్ల డిమాండ్ పెరుగుతుందని తెలిసినా, త్యాగం చేయడానికి కూడా చంద్రబాబు సిద్ధమయ్యారంటున్నారు.

పొత్తు కోసం ప్రయత్నాలు….

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఎన్నికల్లో ఓటమి ఎదురైన నాటి నుంచి మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడమే మానుకున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలపై కూడా రాష్ట్ర ప్రభుత్వాన్నే ఆయన విమర్శిస్తున్నారు. బీజేపీ పెద్దలకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు ఆయన బీజేపీతో పొత్తును కోరుకుంటున్నారు.

మ్యాజిక్ రిపీట్ చేసేందుకు….

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా జనసేన కూడా కూటమిలోకి వస్తుంది. ఈ మూడు పార్టీల కలయికతో మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే సానుకూలత వచ్చే వరకూ ఢిల్లీ గడప తొక్క కూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుంది. రఘురామ రాజు విషయంలో బీజేపీ కొంత సానుకూలంగా ఉండటంతో జగన్ పట్ల వారి భ్రమలు తొలగిపోయాయని చంద్రబాబు భావిస్తున్నారు.

షా ఒప్పుకుంటేనే …

అందుకే వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వచ్చే పార్టీలు సీట్ల సంఖ్యను కూడా పెంచేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ముందుగా జగన్ ను అధికారం దించడమే చంద్రబాబు లక్ష్యం. అవసరమైతే పార్టీని పణంగా పెట్టడానికైనా సిద్ధమని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. బీజేపీ, జనసేనలకు బలం ఉన్న జిల్లాల్లో వారు కోరుకున్న సీట్లను ఇచ్చేసి మిగిలిన చోట్ల తమ పార్టీ అభ్యర్థులతో బరిలోకి దిగాలన్నది చంద్రబాబు వ్యూహంగా ఉంది. అయితే ఇందుకు అమిత్ షా ఓకే చెప్పాల్సి ఉంటుంది. అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు.

Tags:    

Similar News