Chandrababu : కుప్పం అంత భయపెడుతుందా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికలు తన రాజకీయ జీవితంలోనే సవాల్ గా మారనున్నాయి. ఆయన ఎన్నడూ లేని టెన్షన్ కు గురవుతున్నారు. ఒక వైపు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికలు తన రాజకీయ జీవితంలోనే సవాల్ గా మారనున్నాయి. ఆయన ఎన్నడూ లేని టెన్షన్ కు గురవుతున్నారు. ఒక వైపు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికలు తన రాజకీయ జీవితంలోనే సవాల్ గా మారనున్నాయి. ఆయన ఎన్నడూ లేని టెన్షన్ కు గురవుతున్నారు. ఒక వైపు పార్టీ పరిస్థిితి బాగా లేదు. మరోవైపు తన సొంత నియోజకవర్గంలో కూడా తనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్నటి వరకూ తన నియోజకవర్గమైన కుప్పంను చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ప్రచారానికి కూడా వెళ్లలేదు. కానీ ఈసారి అలా వదిలేసే పరిస్థితి లేదు. అందుకే రెండు చోట్ల చంద్రబాబు ఈసారి పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది.
వదులుకోలేరు…
కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు వదులుకోలేరు. వదులుకోబోరు కూడా. కానీ కుప్పం నియోజకవర్గంలో ఈసారి నమ్మకమైన నేతలు కూడా లేరు. ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచే అక్కడ మండలాల వారీగా పార్టీని ప్రక్షాళన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ నేతలను పిలిచి త్వరలో క్లాస్ పీకే అవకాశం కూడా ఉంది. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితి తెలుసుకున్న తర్వాత అక్కడ ఇన్ ఛార్జులను మార్చే అవకాశముందని తెలుస్తోంది.
మరో చోట నుంచి….
ఇక వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచే కాకుండా మరో చోట నుంచి చంద్రబాబు పోటీ చేయాలని భావిస్తున్నారు. తొలుత కుప్పం నుంచి లోకేష్ ను పోటీ చేయించి తాను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. లోకేష్ అయితే కుప్పంలో రివర్స్ అవుతుందని భావించి అక్కడి నుంచి తాను కాకుండా మరొకరు పోటీ చేసే అవకాశం లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు మరో ప్రాంతం నుంచి కూడా చంద్రబాబు పోట ీచేసే అవకాశముంది.
ఉత్తరాంధ్ర అయితే….?
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అయితేనే బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా విశాఖ ప్రాంతం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందని అనుకుంటున్నారు. మూడు రాజధానుల ప్రభావంతో ఉత్తరాంధ్ర లో కొంత టీడీపీ ఇబ్బంది పడే అవకాశముంది. అయితే ఇప్పడిప్పుడే టీడీపీ అక్కడ పుంజుకుంటుండటంతో ఉత్తరాంధ్ర నుంచి కూడా పోటీ చేస్తే పార్టీకి ఆ ప్రాంతంలో హైప్ ఇచ్చిన వారమవుతామని సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. సో.. ఈసారి చంద్రబాబు కుప్పం నుంచి మాత్రమే కాకుండా మరో చోట నుంచి పోటీ చేయనున్నారు.