Tdp : వార్నింగ్ లు ఇవ్వలేక…వారి రియాక్షన్ చూడలేక?
తెలుగుదేశం పార్టీలో అందరూ నేతలే. శాసించే వారే కాని పాటించేవారు లేరు. అధికారం పోయిన తర్వాత చంద్రబాబుకు ఇది పూర్తిగా బోధపడింది. నేతలను కంట్రోల్ చేయడమూ కష్టమే. [more]
తెలుగుదేశం పార్టీలో అందరూ నేతలే. శాసించే వారే కాని పాటించేవారు లేరు. అధికారం పోయిన తర్వాత చంద్రబాబుకు ఇది పూర్తిగా బోధపడింది. నేతలను కంట్రోల్ చేయడమూ కష్టమే. [more]
తెలుగుదేశం పార్టీలో అందరూ నేతలే. శాసించే వారే కాని పాటించేవారు లేరు. అధికారం పోయిన తర్వాత చంద్రబాబుకు ఇది పూర్తిగా బోధపడింది. నేతలను కంట్రోల్ చేయడమూ కష్టమే. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో లేం. అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉన్న నేతలు ఇప్పుడు తలలు ఎగరేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోలేం. అలాగని ఊరుకోలేం. అందుకే చంద్రబాబు ఇప్పుడు అచ్చెన్నాయుడును బాగానే ఉపయోగించుకుంటున్నారు.
ఇప్పుడు ఖాళీయే….
చంద్రబాబు నిత్యం నేతలతో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయన దాదాపు ఖాళీగానే ఉన్నారు. ఎప్పుడు ఎవరైనా వచ్చి కలసి వెళ్లే వెసులుబాటు ఉంది. కానీ నేతలెవ్వరూ ఆయన వద్దకు రావడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే సమస్యకు పరిష్కారం దొరకదు. వాయిదా తప్ప. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తే సొంత పార్టీ నేతలపై కాలు దువ్వుతున్నారు.
జేసీతో నేరుగా…
ఇప్పుడు పార్టీ అధినేతగా జేసీ ప్రభాకర్ రెడ్డిని పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడవచ్చు. వారిని తాడిపత్రి నియోజకవర్గం, అనంతపురం పార్లమెంటు పరిధికే పరిమితం చేసే అవకాశాలున్నాయి. కానీ అలా చేస్తే చంద్రబాబు ఎందుకవుతారు. ఒకవేళ తాను చెబితే జేసీ బ్రదర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆయనకు ఒక అంచనా లేదు. వాళ్లు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటారో ఎవరికీ తెలియదు. అందుకే ఆయన ఆ సాహసం చేయలేకపోయారు. మరోవైపు అనంత టీడీపీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు.
అందుకే అచ్చెన్నతో…
అలాగని జేసీ బ్రదర్స్ ను చంద్రబాబు దూరం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జేసీ బ్రదర్స్ సీమ ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలు కావడంతో వాళ్లు తను చెప్పినట్లు వినరు. వాళ్లు చెప్పినట్లే వినాలంటారు. అందుకే అచ్చెన్నాయుడిని రంగంలోకి దింపారు. జేసీ బ్రదర్స్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇతర నియోజకవర్గాల్లో వేలు పెడితే ఊరుకోమన్నారు. వారు జేసీ బ్రదర్స్ అచ్చెన్న వార్నింగ్ కు భయపడతారా?