Chandrababu : ఇది వరకటి బాబు కాదు.. మారిపోయారు

చంద్రబాబు కొంతకాలం నుంచి స్ట్రాటజీని మార్చారు. ఇదివరకటి చంద్రబాబులా కన్పించడం లేదు. ఎక్కువగా ప్రజల్లోకి ఉండటానికి, మీడియా ముందుకు రావడానికి ఆయన ఇష్టపడటం లేదు. దీనికి కారణం [more]

Update: 2021-10-03 05:00 GMT

చంద్రబాబు కొంతకాలం నుంచి స్ట్రాటజీని మార్చారు. ఇదివరకటి చంద్రబాబులా కన్పించడం లేదు. ఎక్కువగా ప్రజల్లోకి ఉండటానికి, మీడియా ముందుకు రావడానికి ఆయన ఇష్టపడటం లేదు. దీనికి కారణం ఏంటి? చంద్రబాబుకు ఎవరైనా సలహా ఇచ్చారా? లేకుంటే తనంతట తానే ఆ నిర్ణయం తీసుకున్నారా? అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. గత రెండు, మూడు నెలల నుంచి చంద్రబాబు పూర్తిగా మీడియాకు దూరమయ్యారన్నది వాస్తవం.

కెమెరాల ముందు…

చంద్రబాబు ఎప్పుడూ మీడియా అంటే ఇష్టపడతారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ గంటల కొద్దీ ప్రెస్ మీట్లు పెట్టి తన విజన్ ను వివరించేవారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి స్పందించేవారు. చిన్న పథకం నుంచి ప్రారంభోత్సవాల్లో కన్పించేవారు. ఆయనకు మీడియా మ్యానియా అలా ఉండేది. ఒకప్పుడు విపక్షంలో ఉన్న ప్పుడు రోశయ్య మాదిరిగా దాదాపు రోజూ ప్రెస్ మీట్లు ఉండేవి.

విపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా….

ఇక 2019 ఎన్నికల్లో విపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోలేదు. జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ కెమెరాల ముందుకు వచ్చేవారు. ఇక రోజూ మీడియా సమావేశాలు పెట్టి జగన్ సర్కార్ ను ఎండగట్టేవారు. ఇక కరోనా సమయంలోనూ జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశాలను నిర్వహించిన చంద్రబాబు గత కొద్ది నెలలుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు.

సలహాలు, సూచనల వల్లనే….

దీనికి ప్రధాన కారణం రోజూ మీడియా ముందుకు వస్తే పలుచనయి పోతామని భావించడమే దీనికి కారణమంటున్నారు. కొందరు మీడియా అధిపతులు కూడా సలహా ఇచ్చారట. కెమెరాల ముందుకు రాకుండా ఎక్కవ కాలం ట్విట్టర్ ద్వారానే స్పందించాలని సూచనలు చేయడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. రోజూ వస్తే ప్రజలు సోదిగా భావిస్తారని, అప్పుడప్పడూ వస్తే ఇమేజ్ పెరుగుతుందని చెప్పడంతోనే చంద్రబాబు మీడియాకు దూరంగా ఉంటున్నారంటున్నారు. ప్రజలలోకి వెళ్లకపోవడానికి లోకేష్ ను పంపడం కోసమేనన్న చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News