Chandrababu : బాబుకు పవన్ దారి చూపారా?
బద్వేల్ ఉప ఎన్నికకు ఇక సమయం లేదు. ఈ నెల 30వ తేదీన ఎన్నిక జరగనుంది. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. [more]
బద్వేల్ ఉప ఎన్నికకు ఇక సమయం లేదు. ఈ నెల 30వ తేదీన ఎన్నిక జరగనుంది. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. [more]
బద్వేల్ ఉప ఎన్నికకు ఇక సమయం లేదు. ఈ నెల 30వ తేదీన ఎన్నిక జరగనుంది. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన టీడీపీకి ఇబ్బందికరంగా మారనుంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలుగుదేశం పార్టీ కూడా పోటీ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అభ్యర్థిని ప్రకటించి….
చంద్రబాబు బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయించారు. అభ్యర్థిగా డాక్టర్ రాజశేఖర్ ను బరిలోకి దింపారు. ఆయన కొంత కాలంగా ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి పవన్ కల్యాణ్ సంప్రదాయాన్ని అనుసరించి తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి టీడీపీ అధినేత చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టారు. అదే సంప్రదాయాన్ని చంద్రబాబు కూడా పాటించాలి కదా? అన్న ప్రశ్నను పవన్ లేవెనెత్తినట్లయింది.
నంద్యాలలోనూ….
అయితే గతంలో నంద్యాల ఉప ఎన్నిక సమయంలో వైసీపీ పోటీకి దింపింది. అప్పుడు వైసీీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మరణంతో ఇది తమ సిట్టింగ్ స్థానమని పోటీకి దిగామని వైసీపీ చెబుతుంది. అలాగే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేశామని గుర్తు చేస్తుంది. అక్కడ మృతి చెందిన వారి కుటుంబాలకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
ఆ అవకాశమే లేదు….
ఇప్పుడు బద్వేలు బరి నుంచి చంద్రబాబు తప్పుకునే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థిని నిర్ణయించడంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉందో చంద్రబాబు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలను ఫీడ్ బ్యాక్ గా తీసుకోవాలనుకుంటున్నారు. జనసేన, బీజేపీ తప్పుకుంటే ఆ ఓటు బ్యాంకు తమకు టర్న్ అయి వైసీపీ మెజారిటీ తగ్గుతుందని చంద్రబాబు లెక్కలు వేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు మాత్రం బద్వేలు ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీకి దింపుతారని, వెనక్కు తగ్గరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.