Chandrababu : వాళ్లే పెద్ద సమస్యగా మారారే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కొందరు నేతలు గుదిబండగా మారారు. పార్టీకి ఉపయోగపడతారని పార్టీలోకి తెచ్చుకుంటే వారు ఇప్పుడు సమస్యలను సృష్టిస్తున్నారు. పార్టీ ఇబ్బంది పడుతున్న సమయంలో [more]

Update: 2021-10-12 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కొందరు నేతలు గుదిబండగా మారారు. పార్టీకి ఉపయోగపడతారని పార్టీలోకి తెచ్చుకుంటే వారు ఇప్పుడు సమస్యలను సృష్టిస్తున్నారు. పార్టీ ఇబ్బంది పడుతున్న సమయంలో మౌనంగా ఉండి, రేపు ఎన్నికల సమయానికి టిక్కెట్ల కోసం ఎగబడే అవకాశముంది. అందుకే చంద్రబాబు యాక్టివ్ గా ఉన్న నేతలను గుర్తించి వారిని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి వల్ల ప్రయోజనం లేకపోగా పార్టీలో వారిపట్ల అసంతృప్తి తలెత్తుండటం చంద్రబాబు సీరియస్ గానే తీసుకున్నారు.

బలపడతామని….

చంద్రబాబు రాజకీయంగా భయస్థుడు. ఆయన ఏ నిర్ణయమూ సరైన సమయంలో సరిగా తీసుకోలేరు. పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వానించారు. ప్రధానంగా రాయలసీమలో పార్టీకి రెడ్డి సామాజికవర్గానికి చెందిన సరైన నేత లేకపోవడంతో జేసీ బ్రదర్స్ ను తీసుకువచ్చారు. అధికారంలో ఉన్నంత వరకూ బాగానే ఉన్న వారు విపక్షంలోకి వచ్చిన తర్వాత తలనొప్పిగా మారారు. పార్టీలో జిల్లా నేతలంతా వారిని వ్యతిరేకిస్తున్నారు. వారిని ఏం చేయలేక, వారిపై చర్యలు తీసుకోలేక చంద్రబాబు సతమతమవుతున్నారు.

వారి రాకతో ….

ఇక కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబాన్ని పార్టీలోకి తీసుకొచ్చారు. ఇక్కడ పార్టీ బలపడకపోగా ఉన్న నేతలు కూడా అసంతృప్తికి గురయ్యారు. కోట్ల కుటుంబం యాక్టివ్ గా లేదు. ఇక వారిని తీసుకొచ్చి ఏం ప్రయోజనం అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోట్ల కుటుంబంతో కర్నూలు జిల్లాలో పట్టు సాధిస్తామని భావించిన చంద్రబాబుకు మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక భూమా కుటుంబంతో కొందరు టీడీపీ నేతలు పార్టీకి దూరమవుతున్నారు.

వారిని ఏమీ అనలేక…

అలాగే మాజీ కాంగ్రెస్ నేత కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి వంటి వారిని పార్టీలోకి తెచ్చుకున్నా ప్రయోజనం ఏమీ లేదు. కిషోర్ చంద్రదేవ్ రెండున్నరేళ్లుగా గాయబ్ అయ్యారు. అలాగే ఇతర పార్టీల నుంచి తీసుకున్న 23 మంది అప్పటి ఎమ్మెల్యేల్లో ఇరవై మంది యాక్టివ్ గా లేరు. కొందరు వైసీపీ వైపు చూస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పెద్ద సమస్యగా మారారు.

Tags:    

Similar News