Chandrababu : బ్యాడ్ రిమార్క్ ను అధిగమిస్తారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వయం ప్రకాశిత నేత కాదు. ఆయన ఇతరులపై ఆధారపడి విజయం సాధించాల్సిందే. ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి అయింది కూడా అనేక అంశాలు [more]

Update: 2021-10-17 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వయం ప్రకాశిత నేత కాదు. ఆయన ఇతరులపై ఆధారపడి విజయం సాధించాల్సిందే. ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి అయింది కూడా అనేక అంశాలు కలసి వచ్చాయి. ఏరోజూ ఒంటరిగా గెలవలేకపోయారన్న బ్యాడ్ రిమార్క్ చంద్రబాబుపై ఉంది. 2019లో మరోసారి ఇది రుజువయింది. అందుకే టీడీపీ క్యాడర్ లోనూ చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమన్న బలమైన అభిప్రాయం నెలకొంది. అది ఎన్నికల సమయంలో మరింత బలహీనంగా మారే అవకాశముంది.

అన్ని విజయాలు పొత్తులతోనే….

1999లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కలసి పోటీచేసి అధికారంలోకి వచ్చాయి. అప్పుడు వాజ్ పేయి హవా ఉపయోగపడింది. 2014లోనూ మోదీ రూపంలో చంద్రబాబుకు కలసి వచ్చింది. ఇవన్నీ అందరికీ తెలిసినవే. కానీ ఈసారి పొత్తు జనసేనతో కుదురుతుందా? లేదా? అన్న బెదురు టీడీపీ నేతల్లో నెలకొంది. జనసేన తమతో కలిస్తే పోలింగ్ బూత్ స్థాయిలో వైసీపీ క్యాడర్ ను ఎదుర్కొనడానికి వీలవుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

వయసు కార్డు తీసి…

చంద్రబాబుకు ఉన్న ఏకైక అడ్వాంటేజీ ఆయన వయసు. చంద్రబాబుకు చివరి ఎన్నికలు ఇవే. ఆయన వయసు రీత్యా 2029 ఎన్నికల నాటికి యాక్టివ్ గా ఉండకపోవచ్చు. ప్రత్యక్ష రాజకీయాల్లోనూ పాల్గొనక పోవచ్చు. అందుకే చంద్రబాబు ఈ కార్డు వాడే అవకాశముంది. తనకు చివరి ఛాన్స్ అని చంద్రబాబు ప్రచారం చేసి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇస్తారు.

జనసేన కలిస్తేనే?

చంద్రబాబు అనుభవం, ఆయనకున్న విజన్ దీనికి తోడవుతాయి. ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం చంద్రబాబు పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. అయితే ప్రస్తుతం వైసీపీ బలంగా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు బలం ఒక్కటే సరిపోదు. దానికి పవన్ కల్యాణ్ తోడు కావాల్సిందేనంటున్నారు. అది జరిగితేనే చంద్రబాబు ఏపీకి మరోమారు సీఎం అవుతారన్నది విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News