Kvp : వచ్చే ఎన్నికల్లో కేవీపీ కీలకంగా మారనున్నారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆసక్తికరంగా మారనున్నాయి. ప్రధానంగా జగన్ ను కార్నర్ చేయడానికి అందరూ ఏకమయ్యే పరిస్థిితి నెలకొంది. ఇప్పటికే పొత్తుల దిశగా తెలుగుదేశం [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆసక్తికరంగా మారనున్నాయి. ప్రధానంగా జగన్ ను కార్నర్ చేయడానికి అందరూ ఏకమయ్యే పరిస్థిితి నెలకొంది. ఇప్పటికే పొత్తుల దిశగా తెలుగుదేశం [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆసక్తికరంగా మారనున్నాయి. ప్రధానంగా జగన్ ను కార్నర్ చేయడానికి అందరూ ఏకమయ్యే పరిస్థిితి నెలకొంది. ఇప్పటికే పొత్తుల దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుంది. టీడీపీ కూటమిని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది. బీజేపీని దూరం బెట్టి జనసేనను దగ్గరకు తీసుకోవాలన్నది ప్లాన్. టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కూటమిలో ప్రధాన పార్టీలు కానున్నాయి.
మిగిలిన పార్టీలతో కలిసి…..
ఒకవేళ జనసేన పార్టీ తమతో కలిసేందుకు అంగీకరించకపోయినా కాంగ్రెస్, కమ్యునిస్టులతో కలసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ కు కూడా ఇప్పుడు ఏదో ఒక ఆసరా కావాల్సి ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ లో వైెఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల చేత జగన్ పై విమర్శలు చేయించాల్సి వస్తుంది. ముఖ్యంగా కేవీపీ రామచంద్రరావు కీలకంగా మారనున్నారు. కేవీపీని ముందు పెట్టి గేమ్ ప్లాన్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
పొత్తులో భాగంగా….
ఈ మూడు పార్టీలయితే పొత్తులో భాగంగా పెద్దగా సీట్లను కూడా ఇచ్చే అవకాశముండదు. కేవలం ముప్ఫయి స్థానాల్లోపే మూడు పార్టీలకూ సర్దేయొచ్చు. దీంతో పాటు వైఎస్ కు సన్నిహితులైన కేవీపీ రామచంద్రరావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శైలజానాధ్ వంటి నేతలచేత ప్రచారం చేసి జగన్ ను కొంత దెబ్బతీయవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పై కొంత ప్రజలకు ఆగ్రహం తగ్గింది. దశాబ్దకాలంగా శాసనసభలో స్థానం లేకపోవడంతో కాంగ్రెస్ కు కూడా టీడీపీ మద్దతు అవసరం.
బీజేపీకి దూరంగానే…?
ప్రస్తుతం ఏపీ ప్రజల కోపం బీజేపీపైకి మళ్లింది. బీజేపీని దెబ్బ కొట్టకపోతే కష్టమని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీ దేనికి తలొగ్గదు. కాంగ్రెస్ అయితే ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే తాము అడిగినవి అడిగినట్లు అమలు చేస్తారు. అందుకే చంద్రబాబు కాంగ్రెస్, కమ్మునిస్టులతో కలసి వెళ్లాలని డిసైడ్ అయ్యారంటున్నారు. దీంతో కాంగ్రెస్ లో వైఎస్ ఆత్మగా పిలుచుకునే కేవీపీ చేతనే వచ్చే ఎన్నికల్లో కథంతా నడిపించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. మరి చంద్రబాబు వ్యూహానికి కేవీపీ పడతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.