Chandrababu : ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫ్రస్టేషన్ కు లోనయ్యారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఆయన స్పందించారు. పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ అరాచకాలను సృష్టిస్తున్నారన్నారు. తన [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫ్రస్టేషన్ కు లోనయ్యారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఆయన స్పందించారు. పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ అరాచకాలను సృష్టిస్తున్నారన్నారు. తన [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫ్రస్టేషన్ కు లోనయ్యారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఆయన స్పందించారు. పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ అరాచకాలను సృష్టిస్తున్నారన్నారు. తన ఇంటిపై కూడా దాడికి వస్తే దిక్కులేకుండా పోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 356 ఆర్టికల్ ను ప్రయోగించాలన్నారు. ఈ దాడుల వెనక ముఖ్యమంత్రి జగన్, డీజీపీ గౌతం సవాంగ్ ల ప్రమేయం ఉందని ఆరోపించారు.
పులివెందుల రాజకీయం….
టీడీపీ కార్యాలయం దేవాలయం లాంటిదని, అలాంటి కార్యాలయంపై దాడులు చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. దాడులకు దిగుతూ భయోత్పాత వాతావరణాన్ని సృష్టించారన్నారు. తాము దాడులకు భయపడబోమని, ఇంకెన్ని దాడులు జరుగుతాయో చూస్తామని అన్నారు. ఇలాంటి రౌడీలను తన రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానన్నారు. పులివెందుల రాజకీయాన్ని చేయవద్దని అన్నారు.
పట్టాభి వ్యాఖ్యలను మాత్రం….
దాడులపై ప్రస్తావించిన చంద్రబాబు పట్టాభి వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చని చంద్రబాబు అన్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల వల్లే ఈ దాడులు జరిగినా, ఆయన మాత్రం ఆ వ్యాఖ్యల పట్ల ఏమాత్రం స్పందించలేదు. తమను వైసీపీ నేతలు బూతులు తిడుతున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. తన ఇంటి మీద దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.
అమిత్ షాతో మాట్లాడా…
దాడులు జరిగిన వెంటనే డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని, అమిత్ షా మాత్రం తనతో మాట్లాడారన్నారు. ఏపీకి కేంద్ర బలగాలను కోరారని చెప్పారు. ఈ దాడులపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. కేంద్ర స్థాయిలో దీనిపై పోరాటం చేసి జగన్ ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు కార్యాచరణను చంద్రబాబు రూపొందించనున్నారు. మీడియా సమావేశంలో చంద్రబాబు ఆవేశం స్పష్టంగా కన్పించింది.