pattabhi : శభాష్ పట్టాభీ.. నేను చేయలేనిది.. నువ్వు చేశావ్

తెలుగుదేశం పార్టీ అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది. గత రెండున్నరేళ్లుగా చేయలేని పనిని పట్టాభి ఒక్క రోజులో చేసి పెట్టారు. వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకమవుతున్నాయి. చంద్రబాబు [more]

Update: 2021-10-20 02:00 GMT

తెలుగుదేశం పార్టీ అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది. గత రెండున్నరేళ్లుగా చేయలేని పనిని పట్టాభి ఒక్క రోజులో చేసి పెట్టారు. వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకమవుతున్నాయి. చంద్రబాబు కోరుకున్నదదే. జరుగుతుందీ అదే. నిన్న టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. పట్టాభి వ్యాఖ్యలు విన్న వారెవరైనా అసలు అధికార ప్రతినిధి పదవి పట్టాభికి ఎందుకిచ్చారన్న ప్రశ్న వేసుకుంటారు.

అన్ని పార్టీలూ….

అలాంటి సమయంలో పట్టాభి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యాయాలపై దాడులకు దిగాయి. దీంతో పట్టాభి తిట్టిన తిట్లన్నీ గాలిలో కలసి పోయాయి. వైసీపీ దాడులు మాత్రమే కన్పిస్తున్నాయి. నిజానికి పట్టాభి ముఖ్యమంత్రి జగన్ పై ఆ వ్యాఖ్యలు చేయకుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. కానీ దానిని వదిలేసి కాంగ్రెస్ నుంచి వామపక్షాల వరకూ టీడీపీకి అండగా నిలిచాయి. ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించాయి.

పవన్ సయితం….

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సయితం టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఖండించారు. ఇందుకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అంతేకాని పట్టాభి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించలేదు. ఆయనకు రాసిచ్చిన స్కిప్ట్ వరకూ చదవి వెళ్లిపోయారు. ఇక కమ్యునిస్టు పార్టీలో ఒకటైన సీపీఐ కూడా పట్టాభి వ్యాఖ్యలను ఖండించకుండా దాడులను ఖండించి టీడీపీకి మద్దతు తెలిపింది.

కాంగ్రెస్ టీడీపీ కార్యాలయంలో….

కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాయాలనికి చేరుకుని పరిశీలించడం విశేషం. టీడీపీ కార్యాలయంపై దాడులను పీసీీసీ చీఫ్ శైలజానాధ్ తో సహా పార్టీ నేతలందరూ ఖండించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు వ్యతిరేకించిన విపక్ష నేతలు పట్టాభి కామెంట్స్ ను మాత్రం సమర్థిస్తున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం మీద చంద్రబాబు తాను అనుకున్నట్లుగా దాదాపు రెండున్నరేళ్ల తర్వాత వైసీపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి.

Tags:    

Similar News