బాబు సంబరపడుతుంది ఆ ఒక్క విషయంలోనే?
చంద్రబాబు నాయుడు విపక్ష నాయకుడు. ఏదైనా సమస్య మీద జనంలో ఉంటూ క్షేత్ర స్థాయిలో పోరాటం చేసి సాధించాలి. కానీ చంద్రబాబు చేస్తున్నది మాత్రం విడ్డూరంగా ఉంది. [more]
చంద్రబాబు నాయుడు విపక్ష నాయకుడు. ఏదైనా సమస్య మీద జనంలో ఉంటూ క్షేత్ర స్థాయిలో పోరాటం చేసి సాధించాలి. కానీ చంద్రబాబు చేస్తున్నది మాత్రం విడ్డూరంగా ఉంది. [more]
చంద్రబాబు నాయుడు విపక్ష నాయకుడు. ఏదైనా సమస్య మీద జనంలో ఉంటూ క్షేత్ర స్థాయిలో పోరాటం చేసి సాధించాలి. కానీ చంద్రబాబు చేస్తున్నది మాత్రం విడ్డూరంగా ఉంది. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని జగన్ పాలనకు బ్రేకులు వేస్తున్నారని ఎటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి విదితమే. దానికి తగినట్లుగా చంద్రబాబు మాటలు కూడా ఉంటున్నాయి. తాజాగా ఆయన చేసిన ఒక కామెంట్ ఇపుడు ఆయన మీదనే ఆయన సెటైర్లు వేసుకున్నట్లుగా ఉంది. తాజాగా ఆయన తాపీగా హైదరాబాద్ నుంచి ట్వీటుతూ కోర్టులు ఉండబట్టే గత ఏడాదిగా జగన్ పాలనను గాడితప్పకుండా సరిచేసి పెట్టాయని అన్నారు. లేకపోతే విద్వంసమే జరిగేది అంటున్నారు.
ఒప్పుకుంటున్నారా….?
ఏదైనా సమస్య ముందు ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలి. అక్కడ పరిష్కారం కాకపోతే ఇతర వ్యవస్థల వైపు చూడాలి. కానీ చంద్రబాబు వైఖరి అంతా ఉల్టా సీదాగా ఉందని అంటున్నారు. ఆయన వ్యవస్థల మీదనే ఆధారపడి రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు వైఖరి కారణంగా పార్టీ చతికిలపడిందని, కోర్టుల ద్వారా పోరాటం చేయడానికి ఇంత పెద్ద పార్టీ ఎందుకు, క్యాడర్ ఎందుకు, ఒక ఎన్జీవో సంస్థను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది కదా అని అంటున్నారు.
చేసింది లేదా…?
నిజానికి జగన్ అవునన్న ప్రతీ దానికీ చంద్రబాబు కాదు అంటూనే వచ్చారు. ఆయన మూడవ సారి ప్రతిపక్ష నేతగా ఇదివరకులా ధీటైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. దానికి కారణం ఆయన వయసు ఒకటి అయితే. రెండవది గతంలో కంటే కూడా తక్కువ సీట్లు రావడం, పార్టీ ఘోరంగా ఓడిపోవడం అంటున్నారు. అలాగే యువ సీఎంగా జగన్ దూకుడు మీద ఉండడంతో అసెంబ్లీలో చంద్రబాబు ఏమీ పెద్దగా మాట్లాడలేకపోతున్నారని అంటున్నారు. అదే సమయంలో బయట కూడా ఆయన ఆందోళనను పెద్దగా చేసింది లేదని పార్టీలోనూ మాట వినిపిస్తోంది. ఇక పార్టీ నేతలు ముఖం చాటేస్తున్నారు, వారిని ఆకట్టుకొవడంలో కూడా చంద్రబాబు విఫలం అయ్యారని అంటున్నారు.
ఇలాగే నెట్టుకొస్తారా…?
ఒక ఏడాది కాలంలో జగన్ సర్కార్ ని కోర్టుల ద్వారా అడ్డుకున్నామని చెబుతున్న చంద్రబాబు మిగిలిన కాలం కూడా ఇలాగే గడిపేస్తారా అన్న సందేహాలను తమ్ముళ్ళే వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు కరోనా వేళ చంద్రబాబు పూర్తిగా హైదరబాద్ కే పరిమితం అయ్యారు. ఓ వైపు మీడియాను మరో వైపు ఇతర రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని జగన్ కాళ్ళకు బేకులు వేశామని సంబర పడడం తప్ప చంద్రబాబు నిజమైన ప్రతిపక్ష నేతగా విఫలం అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. ఇదే ధోరణిలో చంద్రబాబు ముందుకు సాగితే మాత్రం పార్టీ పునాదులు మరింతగా కదిలిపోతాయని అంటున్నారు.