టీడీపీలో మానసిక రోదన.. కీలక నేతల జంప్..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మానసిక ఆవేదన కొట్టొచ్చినట్టు కనిపించింది. మే 27, 28 తేదీల్లో ఘనంగా నిర్వహించిన మహా నాడులోనూ పొల్గొన్న మాజీ మంత్రి శిద్దా [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మానసిక ఆవేదన కొట్టొచ్చినట్టు కనిపించింది. మే 27, 28 తేదీల్లో ఘనంగా నిర్వహించిన మహా నాడులోనూ పొల్గొన్న మాజీ మంత్రి శిద్దా [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మానసిక ఆవేదన కొట్టొచ్చినట్టు కనిపించింది. మే 27, 28 తేదీల్లో ఘనంగా నిర్వహించిన మహా నాడులోనూ పొల్గొన్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. తన కుమారుడుతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి రెండు మూడు నెలలుగా ఈ వార్తలు హల్ చల్ చేయడం తెలిసిందే. ఇదే విషయాన్ని చంద్రబాబుకు సీనియర్లు చెప్పినా.. ఆయన ఆదిలో తోసిపుచ్చారు. శిద్దా మనోడే.. మనం అనేక వ్యాపారాలు ఇచ్చాం.. కాంట్రాక్టులు ఇచ్చాం.. మనల్ని వదిలే ప్రసక్తి లేదు. ఇంకేమైనా ఉంటే చెప్పండి! అంటూ సీనియర్లపైనే చంద్రబాబు సీరియస్ అయ్యారు. చంద్రబాబు అన్నట్టుగానే శిద్దా రాఘవరావు మహానాడుకు హాజరై.. తన స్వామి భక్తిని ప్రదర్శించారు.
కొత్త నేతలను తయారు చేయాలన్నా….
కానీ, ఇంతలోనే పిడుగు పడింది. వైసీపీలోకి చేరిపోతున్నట్టు ఆయనే స్వయంగా చెప్పారు. సరే! ఇక త్వరలోనే మరో నలుగురు పార్టీ మారతారనే ప్రచారం కూడా ఊపందుకుంది. పోనీ.. పోతే పోనీ.. అని ఊరుకుందామంటే.. జగన్ లాగా తెగింపు ఉన్న వ్యక్తి కాదు. పైగా రోజుల తరబడి మౌనంగా ఉందాంలే.. ఎవరేమనుకున్నా.. బేఫికర్ అనుకునే తత్వం కూడా లేని చంద్రబాబు ఈ పరిణామాలపై కుతకుతలాడుతున్నారు. ఇప్పుడు కిం కర్తవ్యం? అని ఆయన తర్జన భర్జన పడుతున్నారు. నిజమే.. ఇప్పుడు ఏం చేయాలి ? బలమైన నాయకత్వం పోతే.. కొత్తవారిని తయారు చేసుకోగలమనే ధీమా ఉన్నప్పటికీ.. యువ నేతలు కూడా పార్టీలో దూకుడుగా లేకపోవడం చంద్రబాబును కలవరపరుస్తొంది.
ప్రజల్లోకి వెళ్లడమే మంచిదంటూ…..
ఇక పార్టీకి అన్ని విధాలా ఆర్థికంగా ఆదుకున్న వారు కూడా పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు. ఇక పార్టీలో మూడున్నర దశాబ్దాల అనుబందం ఉన్న వారు కూడా వెళ్లిపోతుండడంతో చంద్రబాబు ఏం చేయలేక బేల చూపులు చూడడం మినహా వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. తనపై వారిలో నమ్మకం కలిగించ లేకపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన సీనియర్లతో భేటీ అయ్యారు. నెక్ట్స్ ఏంటి ? అనే విషయంపై చర్చించారు. గతంలో వైసీపీ అధినేత అనుసరించినట్టే ఎదురుదాడి చేయడమా ? లేక ప్రజల్లోకి వెళ్లడమా? అనే విషయంపై దృష్టి పెట్టారు. ప్రజల్లోకి వెళ్లడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, ఇప్పటికిప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్దేశిత కారణం కనిపించడం లేదు.
చివరకు చంద్రబాబు….
పైగా చంద్రబాబుకు ఇప్పుడు 70 ప్లస్. సో.. ఇది జరిగే పనికాదు. ఎదురు దాడి చేయడమే ఇప్పటికిప్పుడు ఉత్తమమైన కార్యక్రమంగా నిర్దారించారు. కానీ, దీనివల్ల ప్రయోజనం ఉంటుందా? అనేది కూడా మరో మీమాంస. ఏదేమైనా.. రాబోయే రోజుల్లో వైసీపీ ఆగడాలపై మరింతగా ప్రచారం చేయడంతోపాటు.. పార్టీలో యువతను బలోపేతం చేయడం ప్రధానమని చివరాఖరుకు తమ్ముళ్లు చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు జై కొట్టినట్టు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.