బాబు చెవిలో కమలం …?

రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు కు బిజెపి చుక్కలు చూపించేస్తుంది. గత ఎన్నికల ముందు బిజెపి పార్టీపైనా మోడీ వంటి నేతల పైనా ఒంటికాలిపై లేచిన చంద్రబాబు కు [more]

Update: 2019-12-05 08:00 GMT

రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు కు బిజెపి చుక్కలు చూపించేస్తుంది. గత ఎన్నికల ముందు బిజెపి పార్టీపైనా మోడీ వంటి నేతల పైనా ఒంటికాలిపై లేచిన చంద్రబాబు కు చెక్ పెట్టడమే లక్ష్యంగా కాషాయ పార్టీ అడుగులు పడుతున్నాయి. టిడిపి తమతో ఆడుకున్న తీరుపై పగతో రగులుతున్న కమలనాథులు ప్రత్యేక వ్యూహంతోనే రాజకీయం నడిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇసుక దీక్ష , అంతకుముందు పవన్ లాంగ్ మార్చ్ కార్యక్రమాలకు బిజెపి సమదూరం పాటించింది.

బాబు రౌండ్ టేబుల్ మీట్ కి డుమ్మా నే…

చంద్రబాబు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కి బిజెపి డుమ్మా కొట్టింది. వాస్తవానికి ప్రజా సమస్యలపై విపక్షాన్నిటిని ఏకతాటిపై తేవడం అన్నది చంద్రబాబు లక్ష్యంగా తెరపై కనిపించే దృశ్యం. తెరవెనుక మాత్రం బిజెపితో తక్షణ దోస్తీ టిడిపి ప్రధాన లక్ష్యం అన్నది తేలిపోతుంది. అందుకే ఇది గమనించిన కమలం సొంత ఎదుగుదలపైనే దృష్టి సారించింది. టిడిపి తోక పార్టీగా ఉన్నంత కాలం ఎదుగుదల ఉండదనే బిజెపి ఈ జాగ్రత్తలు తీసుకుంటుంది.

దగ్గరవ్వాలనుకున్నా…..

ఆంధ్రప్రదేశ్ లో అటు చంద్రబాబు కైనా ఇటు పవన్ కల్యాణ్ కైనా కేంద్రం ఆశీస్సులు లేకపోతే వైసిపి నుంచి కేసుల ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి చూపు బిజెపిని ప్రసన్నం చేసుకోవడం మీదే లగ్నమైంది. ఈ రెండు పార్టీల్లో జనసేన నే బిజెపి లైక్ చేసే అవకాశాలు మెండుగా. ఉన్నాయి. చంద్రబాబు విషయంలో దూరం పాటించాలనే బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి దూరంగా కమలనాధులు ఉన్నారన్న టాక్ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ విన్పిస్తుండటం విశేషం.

Tags:    

Similar News