వసూల్ వసూల్…. పైసా వసూల్

అమరావతి లోనే రాజధాని ఉండాలంటూ టీడీపీ భారీ ఉద్యమానికి తెరతీసింది. జగన్ సర్కార్ అనుకున్నదే చేస్తుందని గ్రహించిన తెలుగుదేశం సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం అయ్యింది. దీనికి ఖర్చు [more]

Update: 2020-01-10 03:30 GMT

అమరావతి లోనే రాజధాని ఉండాలంటూ టీడీపీ భారీ ఉద్యమానికి తెరతీసింది. జగన్ సర్కార్ అనుకున్నదే చేస్తుందని గ్రహించిన తెలుగుదేశం సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం అయ్యింది. దీనికి ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. అసలే పార్టీ అధికారంలో లేదు. గెలిచిన నేతలు తక్కువ ఓడిపోయినవారు ఎక్కువ. ఈ దశలో పార్టీ ఆర్ధికభారాన్ని మోసేందుకు ఎవ్వరు ముందుకు రాని పరిస్థితి. ఎవ్వరు జేబులో తీసి ఖర్చు పెట్టె సాహసానికి పూనుకోవడం లేదు. దాంతో ఎవరైనా ఏం చేస్తారు ప్రజల నుంచే చందాలు వసూలు చేయడం తప్ప మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలో తన జీవితంలో తొలిసారి జోలె పట్టుకోవాలిసి వచ్చింది టీడీపీ అధినేతకు.

అడుగు బయటపెడితే …

ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ నుంచి అన్ని ధరలు చుక్కలు అంటుతున్నాయి. ఆర్థికమాంద్యం ముప్పిరిగొని అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఉన్న సొమ్మంతా ఎన్నికలకు ముందు అమరావతి భూములపైనా ఎలక్షన్ లలో గెలిచేందుకు ధారపోసేశారు తమ్ముళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఆఫీస్ వైపు వెళితే ఎలాంటి ఇండెంట్ పడుతుందో అని భయపడే రోజుల్లో చంద్రబాబు అమరావతి ఉద్యమానికి శ్రీకారం చుట్టడం పార్టీ శ్రేణుల్లో గుబులు రేకెత్తించింది. సహజంగానే టీడీపీ నేతలు చేతులు ఎత్తక తప్పని పరిస్థితి. క్యాడర్ ఖర్చుల సంగతి దేవుడెరుగు డీజీల్ ఖర్చులకు తడుముకోవాలిసి వస్తుందని స్వయంగా అధినేత దగ్గరే కొందరు వాపోవడంతో బాబు జోలె స్కీం కి సై అనక తప్పలేదు. అందుకోసమే ముందుగా తమ కుటుంబం నుంచే చందాల వసూలు చేసి అందరిని భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో బాబు భువనేశ్వరి గాజులు సమర్పించుకునేలా చేశారని అంటున్నారు.

ఇప్పటికే పెయిడ్ విమర్శలు ….

ఇప్పటికే అమరావతిలోనే రాజధాని ఉండాలనే ఉద్యమాన్ని పెయిడ్ ఉద్యమం, పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ వైసిపి జనంలోకి బాగా తీసుకుపోయింది. ఈ నేపథ్యంలో అదే నిజమనే రీతిలో టీడీపీ చందాల వసూలు కి దిగిపోవడం మరింత చర్చనీయంగా మారిందన్న విమర్శలు చుట్టుముడుతున్నాయి. రాజధాని ఎక్కడ వున్నా సామాన్య ప్రజలకు ఒరిగింది ఏమి ఉండదు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ చూడని వారు కోట్లమందే ఉంటారని అంటారు. అలాంటిది 13 జిల్లాల ప్రజలను భాగస్వాములను చేసి ఉద్యమించడం అంత సాధ్యం అయ్యేది కాదు. అదీగాక ఉద్యమ ప్రభావం కృష్ణా, గుంటూరు వరకు పరిమితం అవుతుందనుకుంటే అది రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలకే ఉండిపోయింది. ఈ స్థితిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం అంత ఈజీ కాదు. అందుకే క్యాడర్ కి ఖర్చులకన్నా సొమ్ములు ఇస్తే కానీ పని జరిగేలా లేదు. ఇప్పుడు గతంలోలా మద్యం ధరలు లేవు, పెట్రోల్, బిర్యానీ కూడా పెరిగిపోయాయి. ఇలాంటి రోజుల్లో ఏ ఉద్యమం అయినా కాస్ట్లీ గానే ఉండక తప్పదు.

ఆ సొమ్ముకి లెక్కలే లేవు …

ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తున్నాం తలా ఒక ఇటుక అయినా ఇవ్వండి అంటూ చంద్రబాబు గతంలో ఇచ్చిన పిలుపుకి మంచి స్పందనే ప్రజల నుంచి వచ్చింది. ఆన్ లైన్ లో ఇటుకలకు కొందరు డబ్బు చెల్లిస్తే, మరికొందరు నేరుగా చంద్రబాబు కి చెక్ ల రూపం లో మరికొందరు బంగారు వస్తువులు సమర్పించుకున్నారు. ఇక బాబు మద్దతు పత్రికలు సైతం రాజధాని చందాలు వసూలు చేసినా వాటికి లెక్కా పత్రం లేదు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు అండ్ కో అమరావతి ఉద్యమం కోసం చేసే కలెక్షన్ లది అదే పరిస్థితి. ఈ వ్యవహారం కూడా భవిష్యత్తులో వివాదాస్పదం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. చూడాలి ఇలా చందాలు సేకరించి అమరావతి ఉద్యమాన్ని ఎంత ముందుకు బాబు తీసుకువెళతారో.

Tags:    

Similar News