హిట్ అవ్వడం లేదెందుకు?

నిన్న మొన్నటిదాకా అమరావతి వేదికగా జేఏసీ తో కలిసి టిడిపి ఉద్యమం చేస్తూ వచ్చింది. అయితే రాష్ట్రం లోని జిల్లాల నుంచి సరైన స్పందన కరువు అవ్వడంతో [more]

Update: 2020-01-12 05:00 GMT

నిన్న మొన్నటిదాకా అమరావతి వేదికగా జేఏసీ తో కలిసి టిడిపి ఉద్యమం చేస్తూ వచ్చింది. అయితే రాష్ట్రం లోని జిల్లాల నుంచి సరైన స్పందన కరువు అవ్వడంతో నేరుగా టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి యాత్ర మొదలు పెట్టారు. అయినా కూడా ఆయన పర్యటనకు జనం నుంచి అంతంత మాత్రమే స్పందన ఉండటం చర్చనీయాంశం గా మారింది. ఈ పర్యటనలు హిట్ కాకపోవడానికి ప్రధాన కారణాలు చాలానే వున్నాయి. ముఖ్యంగా రాజధాని ఏదైతేనేమి అనే అనాసక్తి, పండగ సీజన్ వెరసి టిడిపి ఉద్యమం పై నీళ్లు చల్లినట్లు అయ్యింది.

ఎంత రెచ్చగొడుతున్నా …

సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు కి అమరావతి కోసం సాగిస్తున్న ఉద్యమం జీవన్మరణ సమస్య. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అమరావతి ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దలేకపోయినా అంతర్జాతీయ స్థాయి పబ్లిసిటీని మాత్రం విపరీతంగా చేశారు. అది ఏ మాత్రం పట్టాలపై కొనసాగకపోయినా ప్రపంచ స్థాయిలో ఆయన పేరు ఇక వినపడే పరిస్థితే ఉండదు. చంద్రబాబు చరిత్ర గా చెప్పుకోవడానికి ఏమి మిగిలే అవకాశమే లేదు. రాజకీయంగా ఆర్ధికంగా అమరావతి అభివృద్ధి అన్న అంశం చంద్రబాబు కి అత్యంత అవసరమైన తరుణంలో వీధిపోరాటాన్ని ఏడుపదుల వయసులో ఆయన చేయక తప్పటం లేదు.

క్లిక్ అయ్యే ఛాన్స్ లేదా …?

జగన్ తాను ఏది అనుకుంటే అదే చేస్తారు. చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు ఇదే వైఖరిని అనుసరించారు. దాంతో ఎన్ని పోరాటాలు అమరావతి కోసం చేసినా ప్రచారానికి తప్ప మరిదేనికి పనికిరాదన్న అనుమానాలు పసుపు పార్టీలోనే గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రలో సైతం ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత భవిష్యత్తులో ప్రమాదమని టిడిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఇప్పుడు సైకిల్ పార్టీకి ఎన్నడూ లేని విధంగా ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పరిస్థితి మారిపోవడంతో చంద్రబాబు ఇకపై ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

Tags:    

Similar News