ప్లాన్ “రివర్స్” అయిందే?

పార్టీ విధానాలు చూస్తే కేవలం ఒక ప్రాంతానికే ప‌రిమిత‌మ‌య్యేలా ఉన్నాయి. నాయ‌కుడు చూస్తే ఎప్పు డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియ‌ని ప‌రిస్థితి. పార్టీ ప‌రిస్థితి చూస్తే [more]

Update: 2020-02-04 03:30 GMT

పార్టీ విధానాలు చూస్తే కేవలం ఒక ప్రాంతానికే ప‌రిమిత‌మ‌య్యేలా ఉన్నాయి. నాయ‌కుడు చూస్తే ఎప్పు డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియ‌ని ప‌రిస్థితి. పార్టీ ప‌రిస్థితి చూస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొ క్క రకంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పట్లో పార్టీ పుంజుకుంటుంద‌నే భావ‌న ఎక్కడా క‌ల‌గ‌డం లేదు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో పార్టీలో ఉండాలా ? వేరే దారి చూసుకోవాలా ? ఇప్పుడు ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ లోని సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు చేస్తున్న ఆలోచ‌న ఇదే. గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి నుంచి పార్టీని కాపాడుకునే ప్రయ‌త్నాలు పార్టీ అధినేత‌గా చంద్రబాబు చేప‌ట్టడం లేద‌నే భావ‌న బ‌లంగా పెరుగు తోంది.

అధికార పార్టీకి…..

జ‌గ‌న్ పార్టీ దూకుడుకు క‌ళ్లెం వేయ‌డంలోను, టీడీపీ పుంజుకునేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగ‌డంలోను చంద్రబాబు చేప‌డుతున్న కార్యక్రమాల‌కు ఎక్కడా ఊపు రావ‌డం లేద‌ని అంటున్నారు త‌మ్ముళ్లు. గతంలో ఇసుక దీక్ష చేప‌ట్టిన‌ప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధ‌మైన ప‌రిస్థితి ఉంది. ఇసుక కొర‌త కార‌ణంగా కార్మికులు ప‌నులు లేక ప‌స్తులు ఉంటున్నారు. దీనిపై ఎలుగెత్తిన టీడీపీ ఉద్యమం బాగానే న‌డిచింది. ఫ‌లితంగా అన్ని ప్రాంతాల్లోనూ నాయ‌కులు అంతో ఇంతో రోడ్ల మీద‌కు వ‌చ్చి ప్రజ‌ల‌ను స‌మీక‌రించారు.

కొన్ని ప్రాంతాలకే…

ఈ కార‌ణంగా టీడీపీపై కొంత మేర‌కు చ‌ర్చ జ‌రిగింది. ఇక‌, ఆ త‌ర్వాత ఈ రేంజ్‌లో చేప‌ట్టిన కార్యక్రమం అంటూ ఏమీ లేక పోయింది. ఇక‌, నెల రోజుల కింద‌ట చేప‌ట్టి అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక భావ‌న రేకెత్తించింద‌నే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. అమ‌రావ‌తి ఉద్యమాన్ని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనివ‌ల్ల రెండు, మూడు జిల్లాల్లో మాత్రమే పార్టీ ప్రభావం క‌నిపించింద‌ని, మిగిలిన జిల్లాల్లో నాయకులు బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు.

ఉత్తరాంధ్ర, సీమ జిల్లాల్లో….

ఉత్తరాంధ్రలో నాయ‌కులు బాగానే ఉన్నా., విశాఖ‌ను రాజ‌ధానిగా వ‌ద్దని అమ‌రావ‌తి మాత్రమే ముద్దనే లైన్ తీసుకున్న చంద్రబాబుకు మ‌ద్దతివ్వలేక పోతున్నారు. అలాగ‌ని బ‌య‌ట‌కు వ‌చ్చి విశాఖ కోసం పోరాటం చేయాలన్నా పార్టీ రెండు నాల్కల ధోర‌ణి అవలంబిస్తోంద‌నే వాద‌న వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఇదే ప‌రిస్థితి సీమలోనూ క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు వ్యూహంతో ఇరుకున ప‌డుతున్నామ‌ని, క‌నీసం పార్టీ స‌మావేశాల‌కు కూడా రాలేని ప‌రిస్థితి ఏర్పడుతోంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News