ఆ పిలుపంటేనే భయం

తెలుగుదేశ పార్టీ నేతలు పదమూడు జిల్లాల్లో పూర్తి ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఆందోళన కార్యక్రమం చేస్తే వెంటనే కేసులు నమోదవుతున్నాయి. పోలీస్ స్టేషన్ల చుట్టూ [more]

Update: 2020-02-16 00:30 GMT

తెలుగుదేశ పార్టీ నేతలు పదమూడు జిల్లాల్లో పూర్తి ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఆందోళన కార్యక్రమం చేస్తే వెంటనే కేసులు నమోదవుతున్నాయి. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, కోర్టు మెట్లు ఎక్కడం వంటివి ఈ ఎనిమిది నెలల్లో అనేక మంది టీడీపీ నేతలు ఎదుర్కొన్నారు. అందుకే చాలా మంది టీడీపీ నేతలు సైలెంట్ గానే ఉంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన నేతలు సయితం కామ్ అయిపోవడానికి ప్రధాన కారణమిదే.

ఏడాది కాకముందే…?

అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకుండానే చంద్రబాబు వరసగా పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తుండటం ఆ పార్టీ నేతలకు చికాకు తెప్పించే విధంగా ఉంది. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను చాలా మంది నేతలు స్కిప్ చేస్తున్నప్పటికీ వెంటనే ఫోన్లు వస్తుండటంతో ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది తెలుసుకోకుండా ఇలా వరస కార్యక్రమాలు చేయడమేంటన్న ప్రశ్న తెలుగుతమ్ముళ్ల నుంచి వస్తుంది.

వరస కార్యక్రమాలతో…..

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక, ఇంగ్లీష్ మీడియం, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసుల పేరుతో వరస కార్యక్రమాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అయిష్టంగానే కార్యక్రమాలను ఏర్పాటు చేసినా ప్రభుత్వం నుంచి కేసులను ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకే జిల్లా టీడీపీ అధ్యక్షులు సయితం కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు బస్సు యాత్రకు పిలుపు నిచ్చారు. ఈ నెల 17వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు బస్సు యాత్రలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు నిచ్చారు.

ఎవరు భరిస్తారు?

కాని ఈ పిలుపుపై తెలుగుదేశం పార్టీ నేతలు చాలా చోట్ల పెదవి విరుస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయి అప్పుల ఊబిలో చిక్కుకున్న తమను ఇలా వరస కార్యక్రమాలు ఇచ్చి ఇబ్బందుల్లోకి నెడుతున్నారన్నారు. పార్టీ నుంచి ఆర్థిక సాయం కావాలని ఇప్పటికే కొందరు నేతలు కేంద్ర కార్యాలయానికి ఫోన్లు చేసి చెబుతుండటం విశేషం. బస్సు యాత్ర అంటే అంత సులువు కాదని, లక్షల్లో ఖర్చవుతుందని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కార్యకర్తల, జన సమీకరణ కూడా సాధ్యం కాదని కొందరు తేల్చి చెబుతున్నారు. దీంతో చంద్రబాబు పిలుపు అంటేనే నేతలు భయపడే పరిస్థితికి వచ్చారు తెలుగుతమ్ముళ్లు.

Tags:    

Similar News