జగన్ పై స్కెచ్ కి రెడీ

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. తిరిగి అధికారంలోకి రావడమే ప్రధాన అజెండాగా టిడిపి ఇప్పటినుంచి పావులు కదుపుతుంది. గతంలో చేసిన అన్ని తప్పులను [more]

Update: 2019-08-27 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. తిరిగి అధికారంలోకి రావడమే ప్రధాన అజెండాగా టిడిపి ఇప్పటినుంచి పావులు కదుపుతుంది. గతంలో చేసిన అన్ని తప్పులను సరిచేసుకుని ఏపీ లోని విపక్షాలన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి పోరాడాలని చంద్రబాబు పటిష్టమైన స్కెచ్ రూపొందిస్తున్నారు. రాజధాని, పోలవరం అంశాలను ప్రధానంగా తెరపైకి తెచ్చిన టిడిపి చంద్రుడు ఈ సమస్యలపై ఉద్యమం పేరుతో మహాకూటమి కట్టేస్తున్నారు. అయితే బాబు సైకిల్ ఎవరెవరు ఎక్కుతారన్నది ఆసక్తికరంగా మారింది.

జనసేన, కామ్రేడ్స్ రెడీ …. ?

చంద్రబాబు తో ఇప్పటికిప్పుడు చేతులు కలపడానికి జనసేన, కమ్యూనిస్టు పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు వారు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు చెబుతున్నాయి. రాజధాని మార్పుపై అలజడి రేగిన నేపథ్యంలో టిడిపి ఏ వాదన అయితే తెరపైకి తెస్తుందో అదే వాదన ఈ పార్టీల నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అతి తొందర్లోనే విపక్షాలన్నీ ఒకే గూటికిందకు చేరే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరితో బిజెపి చేతులు కలుపుతుందా లేదా అన్నది చర్చనీయం. అస్సలు ఏ మాత్రం ఉనికి లేని కాంగ్రెస్ హస్తిన పెద్దల ఆదేశాల మేరకు జై తెలుగుదేశం నినాదాన్ని ఎలానూ ఇప్పటికే ఇచ్చేస్తుంది.

బిజెపి కి ముందు నుయ్యి వెనుక గొయ్యి …

వైసిపి కి తామే నిజమైన ప్రత్యామ్నాయం అని ప్రకటించుకుంటున్న ఎపి బిజెపి టిడిపి తో చేతులు కలిపితే ఆ పార్టీ తన ఉనికిని మరోసారి ప్రశ్నార్ధకం చేసుకుంటుంది. కమ్యూనిస్ట్ లు వుండే టీం లో బిజెపి చేరే అవకాశాలు ఉండవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి కమలానికి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా తయారయ్యింది.

బాబుతో కలిస్తే జనసేన …

పోగొట్టుకున్న చోటే వెతుక్కునేందుకు సిద్ధం అవుతున్న జనసేన గ్రామస్థాయిలో విస్తరిస్తే టిడిపి ప్లేస్ ను సులువుగా ఆక్రమిస్తుందని అంచనా వుంది. అయితే వైసిపి సర్కార్ పై పోరాటం పేరుతో చంద్రబాబు తో చేతులు కలిపిన పక్షంలో జనసేన పై జరిగిన ప్రచారాన్ని ప్రజలు నిజమని నమ్ముతారని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు తనకు అవసరమైనప్పుడు కలవమంటారని విడిగా ఉండమన్నప్పుడు పవన్ ఒంటరి పోరాటం చేస్తారని గత ఎన్నికల ముందు వైసిపి పెద్దఎత్తున ఆరోపణలు గుప్పించింది. పవర్ స్టార్ కాదు ప్యాకేజి స్టార్ అంటూ విమర్శలు చేసింది. ఇప్పుడు తాము చెప్పినట్లే వీరంతా ఒక్కటే అని మహాకూటమి ఏర్పాటు జరిగితే అధికారపార్టీ ప్రజల్లో చర్చ పెడుతుందని, అది పవన్ పార్టీకి మైనస్ అని రాజకీయ విశ్లేషకుల మాట.

ఇక ఒంటరితనం కరెక్ట్ కాదు …

తన చాణక్య వ్యూహాలతో సింగిల్ గా ఎన్నికల్లో పోరాటానికి దిగి సత్తా చాటాలనుకున్నారు చంద్రబాబు. అయితే ఆ సాహసం టిడిపి కి చేదు అనుభవాలని మిగిల్చింది. అయితే ఎన్నికలు ముగిసిన నాటినుంచి మిగిలిన పక్షాలను కూడా కలుపుకుని పోరాడకపోతే కష్టమన్న అంచనాతో టిడిపి తన సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతుంది. అందులో భాగంగా అమరావతిలోనే రాజధాని వుండాలంటూ ఉద్యమంలో అన్ని పార్టీలను భాగస్వాములను చేసి విజృంభించాలని రెడీ అయ్యింది. మరి చంద్రబాబు ఈ తాజా ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

Tags:    

Similar News