బాబు జాతకం మారుతుందా ?

ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. కానీ రాజకీయ దురంధరుడు చంద్రబాబు మాత్రం ప్రతీ నిర్ణయాన్ని ఆచీ తూచీ అంటారు. అంటే బాగా కాచి వడపోసిన తరువాత [more]

Update: 2020-03-21 08:00 GMT

ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. కానీ రాజకీయ దురంధరుడు చంద్రబాబు మాత్రం ప్రతీ నిర్ణయాన్ని ఆచీ తూచీ అంటారు. అంటే బాగా కాచి వడపోసిన తరువాత కానీ నిర్ణయం ఏదీ ప్రకటించరు. కానీ వర్తమాన రాజకీయాలో వేగవంతమైన నిర్ణయాలకు జనామోదం లభిస్తోంది. జనరేషన్ కూడా మారారు. దాంతో దూకుడుగా ఉండేవారినే ఇష్టపడుతున్నారు. జగన్ అలా దూకుడు రాజకీయం చేస్తూపోతున్నారు. ఏదీ నాన్చరు. వెంటనే తేల్చేస్తారు అని జగన్ కి పేరు. కేసీఆర్ వైఖరి అటు బాబుకు, ఇటు జగన్ కి మధ్యలో ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటికీ ఆ అలవాటు పోగొట్టుకున్నారు కాదు, అది కొన్ని సార్లు మేలు చేసినా ఎక్కువ సార్లు కీడే చేస్తోదని తమ్ముళ్ళు అంటారు.

వాయిదా లాభమా…?

ఇక స్థానిక ఎన్నికల విషయానికి వస్తే బాబు ఎందుకో వాయిదా కోరుకున్నారు. ఎంత ఆలస్యంగా ఎన్నికలు జరిగితే అంత తనకు మేలు అనుకున్నారు. ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే తన పార్టీకి ఉన్న పరువు పోతుందని భయపడినట్లున్నారు. మరి చంద్రబాబు కోరికను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీర్చేశారు. ప్రస్తుతానికైతే చంద్రబాబు ఖుషీగా ఉన్నారు. కానీ ఈ వాయిదా ఆయన అనుకుంటున్నట్లుగా లాభాన్ని తెస్తుందా అంటే భిన్నాభిప్రాయాలే ఉన్నాయి.

వ్యతిరేకత మీదే….?

జగన్ సర్కార్ కి వ్యతిరేకత తొమ్మిది నెలల్లోనే వచ్చిందని చంద్రబాబు మిగిలిన ప్రతిపక్షాలు భ్రమపడ్డాయి. అందుకే ఎన్నికలు పెట్టండని అంటూ సవాల్ చేసే దాకా వెళ్ళాయి. తీరా ఎన్నికలు ప్రకటిస్తే వద్దు, రద్దు అంటూ ఇదే పార్టీలు యాగీ చేశాయి. ఎందుకంటే జగన్ పార్టీకే 95 శాతం దాకా సీట్లు వెళ్ళిపోయి కొంప కొల్లేరవుతోంది. ఇక ఇపుడు ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడ్డాయి. ఆ తరువాత పరిస్థితిని బట్టి ఎన్నికలు జరుగుతాయి. ఓ విధంగా మే నెలలో జరగాలి. కానీ ఏపీలో పొలిటికల్ సీన్ చూసినా, రమేష్ కుమార్ హైదరాబాద్ లో సెటిల్ అయినా తీరు చూసినా మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని చెప్పేయచ్చు. మరో వైపు జగన్ కి వ్యతిరేకత ఉందని భావిస్తే మాత్రం చంద్రబాబు వైపు నుంచే ఎన్నికల డిమాండ్ రావచ్చు.

కరోనా ఆశలు….

కరోనాని కూడా రాజకీయాల్లోకి లాగేయడం స్థానిక ఎన్నికల వాయిదాతోనే మొదలైపోయింది. మళ్ళీ ఇదే కరోనా మేలు చేస్తుందని టీడీపీ టీం ఆశిస్తోందా అంటే అవును అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ వల్ల మరణాలు పెద్దగా లేకపోయినా అర్ధిక వ్యవస్థ దారుణంగా మారుతుంది. ఇప్పటికే ఆర్ధిక మాంద్యం దేశమంతా ఉంది. దానికి ఇది తోడు అయితే దేశంలోనే కాదు, రాష్ట్రంలోనూ దారుణ పరిస్థితులు ఉంటాయి. చాలా మందిని ఉపాధి కూడా ఉండని స్థితి. ఓ విధంగా యుధ్ధానంతర పరిస్థితులే ఉంటాయి. అపుడు నేరుగా పాలకుల మీదనే వ్యతిరేకత వస్తుంది. అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా స్థానిక ఎన్నికలకు చంద్రబాబు డిమాండ్ చేస్తారు. ఆ వచ్చే ఎన్నికల ఫలితాలు వైసీపీకి చేదుగా, టీడీపీకి మేలుగా ఉంటాయి. అలా వాయిదా పడిన ఎన్నికలు చంద్రబాబు జాతకాన్ని కూడా మార్చవచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి.

Tags:    

Similar News