బైబై చెప్పేవారి కోసం బాబు రెక్కీ …?
తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉంటారు ? ఎవరు పోతారు ? అనేది ముందుగానే అంచనా వేసుకునేందుకు స్వయంగా అధినేతే రంగంలోకి దిగుతున్నారు. ఈ రెక్కీ చేపట్టేందుకు ఆయన [more]
తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉంటారు ? ఎవరు పోతారు ? అనేది ముందుగానే అంచనా వేసుకునేందుకు స్వయంగా అధినేతే రంగంలోకి దిగుతున్నారు. ఈ రెక్కీ చేపట్టేందుకు ఆయన [more]
తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉంటారు ? ఎవరు పోతారు ? అనేది ముందుగానే అంచనా వేసుకునేందుకు స్వయంగా అధినేతే రంగంలోకి దిగుతున్నారు. ఈ రెక్కీ చేపట్టేందుకు ఆయన సమీక్షలనే టైటిల్ పెట్టారు. వాస్తవానికి ఎన్నికలు ముగిసి ఆరునెలలు అయ్యింది. ఫలితాలు వచ్చిన తరువాత సమీక్షలను చంద్రబాబు పూర్తి చేసేశారు కూడా. అయితే తిరిగి ఇప్పుడు సమీక్షల పేరిట టూర్ లు మొదలు పెట్టడానికి క్షేత్ర స్థాయిలో పార్టీ తీరును స్వయంగా చంద్రబాబు అంచనా వేసుకోవడానికె అని క్యాడర్ లో టాక్. ఇటీవలే గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఇంచార్జి దేవినేని అవినాష్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకొని చంద్రబాబు ఇదే తీరులో అన్ని చోట్లా నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు జంప్ లు అవుతూ వస్తే దెబ్బ తింటామని ముందే మేల్కొన్నారు. దాంతో గ్యారంటీగా తనతో ఉండేది ఎవరన్న అంచనా పార్టీ శ్రేణులనుంచి సేకరించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.
మూడురోజులు మకాం …
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు లో చంద్రబాబు మూడు రోజులు మకాం వేయనున్నారు. గత ఎన్నికల్లో టిడిపి అత్యంత ఘోర ఫలితాలు నమోదు చేసింది. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కేవలం రెండే స్థానాలు దక్కించుకుని 13 స్థానాలు కోల్పోయి చతికిల పడింది. ప్రస్తుతం భీమవరం, కొవ్వూరు నియోజకవర్గాల్లో పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఇక్కడ కార్యక్రమాలు చేపట్టే వారే లేకుండా పోయారు. ఈ రెండుచోట్లా క్యాడర్ పక్క చూపులు చూస్తున్నారు. తక్షణం ఇక్కడ ఇంచార్జి లను మార్చి ఉనికి చాటాలనుకుంటున్నారు టిడిపి అధినేత చంద్రబాబు. పోలవరం – చింతలపూడి కూడా క్యాడర్ నీరసంగానే వున్నారు. ఇక్కడ కూడా ఇంచార్జి లను మార్చి చూడాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.
నేనున్నా అని భరోసా …
ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా లో చింతమనేని ప్రభాకర్ వరుస కేసుల్లో జైల్లో 66 రోజులు మగ్గి తాజాగా రిలీజ్ అయ్యారు. అయితే ఆయనపై తాజాగా మరో కేసు నమోదు కావడం టిడిపి వర్గాల్లో కలవరం రేపింది. కష్టాల్లో వున్న నేతలకు నైతిక మద్దతు కానీ భరోసా కానీ అధినేత నుంచి లేకుండా పోయిందన్న విమర్శలు ఇటీవల పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ లో అడుగుపెడుతూనే చింతమనేనికి ఓదార్పు ఇవ్వనున్నారు చంద్రబాబు. అధికారపార్టీ వేధింపులకు గురిచేస్తే పార్టీ అండగా వుంటుందనే సంకేతాలు ఇకపై గట్టిగా పెంచాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వైసిపి వైపు పక్క చూపులు చూస్తున్న తమ్ముళ్ళను చంద్రబాబు ఏ మేరకు కట్టడి చేయగలరో చూడాలి.