జ‌గ‌న్ వ్యూహం ఏంటి..? ముంచేసేందుకు ముహూర్తం పెట్టారా?

ఎన్నిక‌లు పూర్తయి ఏడాది అయిన త‌ర్వాత‌.. దీనికి ముందు టీడీపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఆ పార్టీ ఎదుర్కొంటున్న తీవ్ర సంకట స్థితి అంద‌రికీ అర్ధమ‌వుతుంది. ఎన్నిక‌ల‌కు ముందు [more]

Update: 2020-06-17 08:00 GMT

ఎన్నిక‌లు పూర్తయి ఏడాది అయిన త‌ర్వాత‌.. దీనికి ముందు టీడీపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఆ పార్టీ ఎదుర్కొంటున్న తీవ్ర సంకట స్థితి అంద‌రికీ అర్ధమ‌వుతుంది. ఎన్నిక‌ల‌కు ముందు తిరుగులేద‌ని, మ‌ళ్లీ మేమేన‌ని బీరాలు ప‌లికిన పార్టీ నేత‌లు ఇప్పుడు చేతులు ముడుచుకున్నారు. అంతేకాదు, ఈ ఏడాది కాలంలో నేత‌ల‌ను కాపాడుకోలేక అధినేత చంద్రబాబు ప్రయాస‌లు ప‌డుతున్నారు. ఒక‌నాడు.. వైసీపీని రాష్ట్రంలో లేకుండా చేస్తామ‌ని, రాష్ట్రంలో ప్రతిప‌క్షం ఎందుక‌ని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే ఆత్మర‌క్షణ‌లో ప‌డ్డారు. నాయ‌కుల‌ను నిల‌బెట్టుకోలేక పోతున్నార‌నే వాద‌న ఒక‌వైపు ఆయ‌న‌ను తీవ్రంగా వేధిస్తోంది. అదే స‌మ యంలో గ‌త ప్రభుత్వం తాలూకు త‌ప్పులను ఎత్తిచూపుతూ.. జ‌గ‌న్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు మ‌రింత‌గా ఆయ‌న‌ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి.

అదే శాపమయిందా?

“మేం మా ప్రభుత్వంలో త‌ప్పులు చేసి ఉంటే..నిరూపించండి. ఎలాంటి విచార‌ణ‌లైనా జ‌రిపించండి“-అని అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు చేసిన ప్రక‌ట‌న ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల‌కు, ముఖ్యంగా గ‌తంలో చంద్రబాబు కేబినెట్‌లో ప‌నిచేసిన మంత్రులకు శాపంగా మారింది. నిజానికి ప్రభుత్వంలో ఉన్నవారు ఏం చేసినా చెల్లుతుంద‌నే ధోర‌ణిలో చంద్రబాబు కేబినెట్ వ్యవ‌హ‌రించింద‌నేది ఆ పార్టీ నేత‌లు చెప్పే వాస్తవం. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు కూడా ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌లేదు. కానీ, జ‌గ‌న్ స‌ర్కారును నిల‌దీస్తున్నామ‌నే ధోర‌ణిలో అసెంబ్లీలో చంద్రబాబు, ప్రస్తుతం అరెస్టయిన అచ్చన్నాయుడులు ఇద్దరూ కూడా జ‌గ‌న్ ప్రభుత్వా న్ని నిల‌దీశారు. రెచ్చగొట్టారు.

రాబోయే రోజుల్లో…

అయితే, ఎంత రెచ్చ‌గొట్టినా.. రాజ‌కీయాలు వేరు.. వాస్తవాలు వేరు.. సో.. దీనికి దానికి లింకు పెట్టలేం. మ‌రోప‌క్క, చంద్రబాబు హ‌యాంలో నిర్వహించిన అనేక కార్యక్రమాల‌కు ఆయ‌న కు చెందిన హెరిటేజ్ కంపెనీ నుంచే నెయ్యి, పాలు, నీళ్లు వంటివి ఇచ్చి.. ప్రభుత్వ సొమ్మును గుంజేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై కూడా జ‌గ‌న్ ప్రభుత్వం ఏకంగా సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. ఇది మ‌రింతగా పార్టీని, చంద్రబాబు కుటుంబాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ ప‌రంగా దెబ్బలు తింటున్న చంద్రబాబు.. రాబోయే రోజుల్లో కేసుల రూపంలో తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

నాలుగేళ్ల తర్వాత…?

ఇది.. పార్టీకి కూడాతీవ్ర ఇబ్బంద‌నేన‌న్నది విశ్లేష‌కుల మాట‌. అంతిమంగా చూస్తే.. రాబోయే నాలుగేళ్ల త‌ర్వాత పార్టీలో చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు, ఆయ‌న వియ్యంకుడు త‌ప్ప లేదా ప‌ద‌వులు వ‌స్తాయ‌నో ఆశించి మిన‌హా న‌మ్మకంగా ఎవ‌రూ పార్టీలో ఉండే అవ‌కాశం కూడాలేద‌ని అంటున్నారు. ఏదేమైనా.. వైసీపీని అంతం చేస్తామ‌న్న చంద్రబాబు.. ఇలా త‌న పార్టీ మునిగిపోయేందుకు ముహూర్తం పెట్టుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తుండ‌డ‌మే విచార‌క‌ర‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News