చంద్రబాబు నాయుడు కి అవమానాలు జనం కన్నీళ్ళు ?

ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి జీవితంలో ఎదురుకాని చేదు అనుభవాలన్నీ ఒక్కసారే ఎదురౌతున్నాయి. వైఎస్ హయాంలో కూడా పడని పాట్లను [more]

Update: 2019-06-16 10:30 GMT

ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి జీవితంలో ఎదురుకాని చేదు అనుభవాలన్నీ ఒక్కసారే ఎదురౌతున్నాయి. వైఎస్ హయాంలో కూడా పడని పాట్లను అధికార వైసిపి చూపించేస్తుందిట. ఇది తెలుగు తమ్ముళ్ళ ఆందోళన. అసెంబ్లీలో జరిగిన అవమానాలు మొదలు హైదరాబాద్ విమానంలో వెళదామని బయల్దేరిన వెంటాడేస్తుంటే ,తెలుగు ప్రజలు కన్నీటి పర్యంతం అయిపోతున్నారంటూ తమ్ముళ్ళు వేదన వర్ణనాతీతం గా మారిపోయింది. ఒక పక్క అవమానాలు, వేధింపులు, మరోపక్క భద్రత పరమైన ఇబ్బందులు పెట్టేస్తున్నారంటూ రచ్చ రచ్చ మొదలు పెట్టేశారు.

కొట్టిపారేస్తున్న అధికారపక్షం …

ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు డ్రామాలు చేయడం కొత్తకాదని అంటుంది వైసిపి. ఆయన పై ఎలాంటి కక్ష సాధింపు ధోరణితో తమ సర్కార్ లేదని చెబుతుంది. టిడిపి ఎమ్యెల్సీ బుద్ధా వెంకన్న చేసిన ఆరోపణలను మంత్రి బొత్స తీవ్రంగా ఖండించారు. నిబంధనలు ప్రకారమే తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తేల్చారు.బాబు కాన్వాయి లో ఒక్క పైలెట్ వాహనమే ఉండదని ట్రాఫిక్ క్లియెరెన్స్ కానీ ఇతర భద్రత అంతా యాధావిధిగా జరుగుతుందని సర్కార్ స్పష్టం చేసింది. విపక్ష నేతకు విమానాశ్రయంలో జరిగిన తనిఖీలు గతంలో జగన్ విపక్ష నేతగా వున్నప్పుడు జరిగినవే అని గుర్తు చేసింది. కేంద్ర పరిధిలోని ఎయిర్ పోర్ట్ భద్రతా అధికారులు చేసిన పనులకు తమకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తుంది వైసిపి. మరోపక్క విమానాశ్రయ అధికారులు దీనిపై స్పందించి గవర్నర్, ముఖ్యమంత్రులకు మాత్రమే కొన్ని మినహాయింపులు వుంటాయని ప్రతిపక్ష నేతలకు అవి వర్తించవని స్పష్టం చేసేసినా తెలుగు తమ్ముళ్ళు విశాఖ వంటి ప్రాంతాల్లో ఆందోళనకు దిగి బాబుకు గౌరవం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు.

మాజీ అయినా ముఖ్యమంత్రి లాగే…

గతంలో 2004 లో ముఖ్యమంత్రి హోదాను కోల్పోయినా చంద్రబాబు నాయుడు సిఎం మాదిరిగానే వ్యవహరించేవారు. ఇది అప్పట్లో కూడా చర్చనీయాంశం అయ్యేది. పలుసార్లు ఈ విషయాన్ని వైఎస్ గుర్తు చేస్తూ బాబు పై విమర్శలు గుప్పించేవారు కూడా. పదవి కోల్పోయినా ఆయన ఆ ట్రాన్స్ లొంచి బయటకు రావడం లేదంటూ సెటైర్లు సైతం పేల్చేవారు వైఎస్. ఇప్పుడు కూడా చంద్రబాబు అధికార మార్పిడి జరిగిన విషయాన్నీ మర్చిపోయి తదనుగుణంగా మారె నిబంధనలు విస్మరించి పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి నిజంగానే ప్రజల్లో అవమానం పాలౌతున్నారంటూ వైసిపి ఎటాక్ మొదలు పెట్టింది. ఈ విషయంలో మరి ఎక్కువ చేస్తే బూమ్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందని టిడిపి శ్రేణుల్లో సైతం టాక్ నడుస్తుంది.

Tags:    

Similar News