టార్గెట్ బిజెపి నే … ఎందుకు ?
ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే ఇదేనేమో. చంద్రబాబు తప్పు చేసి అమరావతి పూర్తి చేయకపోయినా తప్పు కమలం పార్టీదే. జగన్ మూడు రాజధానులుగా ఎపి [more]
ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే ఇదేనేమో. చంద్రబాబు తప్పు చేసి అమరావతి పూర్తి చేయకపోయినా తప్పు కమలం పార్టీదే. జగన్ మూడు రాజధానులుగా ఎపి [more]
ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే ఇదేనేమో. చంద్రబాబు తప్పు చేసి అమరావతి పూర్తి చేయకపోయినా తప్పు కమలం పార్టీదే. జగన్ మూడు రాజధానులుగా ఎపి లో అడుగులు వేస్తున్నా తప్పు బిజెపిదే. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితికి పరోక్షంగా కమలనాధుల ద్విముఖ వ్యూహమే కారణమన్న చర్చ మొదలైంది. అమరావతి మొదలు పెట్టినప్పుడు అవినీతి అస్త్రాలను టిడిపి పై ఎక్కుపెట్టింది కమలం. ఆ తరువాత జగన్ సర్కార్ కొలువైన తరువాత వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చాక అమరావతి రైతులకు అండగా తాము ఉంటామని భరోసా ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యింది.
నాడు నేడు టిడిపి మైండ్ గేమ్ కే …
ఎపి లో బిజెపి ఎదుగుదలకు బ్రేక్ లను సమర్ధవంతంగా వేయడంలో చంద్రబాబు ఎత్తుగడలు ఎప్పుడు విజయవంతం అవుతూనే వచ్చాయి. తాజాగా కూడా రాజధాని తరలింపు వ్యవహారంలో చంద్రబాబు వైఫల్యాన్ని బిజెపి కి సమర్ధవంతంగా అంటగట్టేయడంలో సైకిల్ పార్టీ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. టిడిపి నుంచి వెళ్లిన సుజనా వంటివారితో గేమ్ మొదలు పెట్టి తాము ఫ్రేమ్ చేసిన వ్యూహానికి అనుగుణంగా ఆటను మలచగలిగింది టిడిపి.
ఆలస్యంగా గుర్తించి….
ఈ వ్యూహం ఆలస్యం గా గుర్తించిన కమలం అధిష్టానం దిద్దుబాటు చర్యలు వేగంగా తీసుకున్నా జరగాలిసిన ఆలస్యం జరిగిపోయింది. కేంద్రం తలుచుకుని ఉంటే రాజధాని తరలింపు ప్రక్రియ కు బ్రేక్ పడేదని కానీ బిజెపి లోపాయికారిగా వైసిపి కి సహకరించింది అనే ప్రచారం తన మీడియా లో హోరెత్తించి తన పాపం పక్క పార్టీకి అంటించేసింది టిడిపి. ఇప్పుడు టిడిపి విసిరిన ఈ వల నుంచి బిజెపి బయటపడటానికి ఎలాంటి కొత్త ఎత్తుగడ అనుసరిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.