సునీల్ కి ఆఫర్ తో తూర్పు లో కలకలం … ?
చెలమలశెట్టి సునీల్ ఈ పేరు కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో తెలియని వారు లేరు. 2009 నుంచి 2019 వరకు ప్రజారాజ్యం, వైసిపి, టిడిపి ల నుంచి [more]
చెలమలశెట్టి సునీల్ ఈ పేరు కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో తెలియని వారు లేరు. 2009 నుంచి 2019 వరకు ప్రజారాజ్యం, వైసిపి, టిడిపి ల నుంచి [more]
చెలమలశెట్టి సునీల్ ఈ పేరు కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో తెలియని వారు లేరు. 2009 నుంచి 2019 వరకు ప్రజారాజ్యం, వైసిపి, టిడిపి ల నుంచి మూడు సార్లు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఒక్కసారి విజయం దక్కించుకొని దురదృష్టవంతుడు సునీల్ గా అందరికి ఆయన సుపరిచితుడు. తొలిసారి చిరంజీవి ఇమేజ్ తో తరువాత జగన్ ఇమేజ్ తో మరోసారి చంద్రబాబు ఛరిష్మా తో గెలవాలని చూసినా పని జరగలేదు ఆయనకు. మొదటి సారి రాజకీయ అరంగేట్రం లో అనుభవలేమి విజయతీరానికి ముందు చెలమలశెట్టి సునీల్ ను ఓటమి పాలు చేసింది. రెండో సారి అదే పరిస్థితి ఇక ముచ్చటగా మూడోసారి సునీల్ ఓటమి పాలై ఇక అయన పోటీ చేస్తే ప్రత్యర్థి కి అదృష్టం ఖాయం అనే ముద్ర మూటగట్టుకున్నారు.
రెండుసార్లు స్వయం కృతం …
టిడిపికి గాలి ఉన్నప్పుడు వైసిపి లో జగన్ ఫ్యాన్ గట్టిగా తిరుగుతున్నప్పుడు సైకిల్ ఎక్కి రాజకీయ తప్పటడుగులు వేశారు చెలమలశెట్టి సునీల్. అయితే ఇప్పుడు మరోసారి అధికారపార్టీ నీడను చేరి పార్లమెంట్ లో అడుగుపెట్టాలన్న తన చిరకాల కోరిక నెరవేర్చుకునేందుకు మరో ప్రయత్నం చెలమలశెట్టి సునీల్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. దీనికి వైసిపి అధినేత జగన్ సైతం సుముఖంగానే ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. 2022 లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి కాపు సామాజిక వర్గానికి ఇచ్చి సునీల్ కోరికను జగన్ తీర్చేందుకు ఒకే చెప్పేశారని దాంతో త్వరలోనే తన బలగం తో చెలమలశెట్టి సునీల్ దూకేస్తారని అంటున్నారు. ఇదే విషయంపై ఇప్పుడు తూర్పు వైసిపి లో కలకలం రేపుతోంది. పార్టీని తొలినుంచి నమ్ముకున్నవారిని కాకుండా ఆయారాం గయారాం లకు జగన్ అవకాశాలు కల్పించి అందలం ఎక్కిస్తే ఎలా అన్నది ఆ పార్టీలో అంతర్మధనం.
బిజెపి జనసేన లకు చెక్ పెట్టాలనే …
పారిశ్రామిక వేత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన చెలమలశెట్టి సునీల్ కు రాబోయే రోజుల్లో బిజెపి, జనసేన లు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టిడిపి లోనే సునీల్ కొనసాగితే అంగ, అర్ధబలం ఉన్న నేత కావడంతో తూర్పు లో వచ్చే ఎన్నికల్లో సైకిల్ స్పీడ్ కు ఛాన్స్ ఉంటుందన్న అంచనాలు జగన్ కి ఉన్నాయని ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో చెలమలశెట్టి సునీల్ ను వైసిపి లో కలిపేసుకుంటే ప్రత్యర్థులకు బలమైన అభ్యర్థులు ఉండే అవకాశం లేకుండా ఉంటుందని జగన్ లెక్కలు వేసినట్లు చెబుతున్నారు. కొందరు ముఖ్య నేతలు ఇదే విషయం అధినేతకు చెప్పడంతో చెలమలశెట్టి సునీల్ రీ ఎంట్రీకి జగన్ ఎస్ అన్నారని టాక్. వచ్చే ఎన్నికల్లో బిజెపి, జనసేన కాపు ఓటు బ్యాంక్ ను పూర్తిగా వారి పార్టీ వైపు టర్న్ చేసుకునే ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నాయని గ్రహించిన వైసిపి బలమైన కాపునేతలకు తమ పార్టీలోనే పెద్ద పీట వేస్తే బిసి లతో సమాన అవకాశాలు వారికి కల్పించడం ద్వారా శత్రువులను దెబ్బకొట్టే వ్యూహంతో ముందుకు వెళ్లాలనే చెలమలశెట్టి సునీల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ వెనుక కారణం అంటున్నారు.