అదృష్టం అంటే వేణుదే కదా మరి

తూర్పుగోదావరి జిల్లా కులాల కుంపట్లకు పెట్టింది పేరు. ఇక్కడ సామాజిక వర్గాల సమతుకం సరిగ్గా లేకపోతే పార్టీల ఓట్లకు చిల్లులు పడతాయి. ఇక్కడ టిక్కెట్ల పంపిణి నుంచి [more]

Update: 2020-07-21 03:30 GMT

తూర్పుగోదావరి జిల్లా కులాల కుంపట్లకు పెట్టింది పేరు. ఇక్కడ సామాజిక వర్గాల సమతుకం సరిగ్గా లేకపోతే పార్టీల ఓట్లకు చిల్లులు పడతాయి. ఇక్కడ టిక్కెట్ల పంపిణి నుంచి మంత్రి పదవుల వరకు సామాజికవర్గాల సమీకరణే ఏ పార్టీకైనా ప్రధానం. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ సైతం ఇదే ఫార్ములాతో ముందుకు సాగుతూ ఉండటంతో జిల్లాలోని రామచంద్రపురం ఎమ్యెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్ కి అదృష్టాన్ని తెచ్చి పెట్టి మంత్రి పదవిని అందిస్తుండటం విశేషం.

బలమైన సామాజికవర్గాన్ని…..

జిల్లాలోని బలమైన కాపు, బిసి, ఎస్సి లు సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు. వీరందరిని సంతృప్తి పరిస్తే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న తూర్పు లో అధికారపార్టీ పై జనం లో సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జగన్ తొలి క్యాబినెట్ కూర్పు సాగింది. ఇప్పుడు కూడా రాజ్యసభకు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపిక అయ్యాక అదే సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్ కి టిక్ పెట్టినట్లు తెలుస్తుంది.

వేణు రాజకీయ ప్రస్థానం ఇది …

తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్ మంచి క్రీడా నేపధ్యం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. క్విక్ బాక్సర్ గా ఉన్న వేణు విద్యావంతుడు బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో దివంగత జక్కంపూడి రామ్మోహన రావు తొలిగా రాజకీయాల్లో ప్రోత్సహించారు. చెల్లుబోయిన వేణుగోపాల్ ను స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డికి పరిచయం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా పరిషత్తు చైర్మన్ కావడంలో క్రీయాశీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఆ పదవిలో రాణించారు.

తొలి నుంచి జగన్ వెంటే….

చెల్లుబోయిన వేణుగోపాల్ కాకినాడ ఎమ్యెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కి తొలి నుంచి మంచి మిత్రుడు. అదేవిధంగా జగన్ వైసిపి స్థాపించిన నాటినుంచి ఆయన వెంటే నడిచారు చెల్లుబోయిన వేణుగోపాల్. ఈ నేపధ్యమే చెల్లుబోయిన వేణుగోపాల్ కి 2019 లో రామచంద్రపురం ఎమ్యెల్యే టికెట్ వైసిపి నుంచి వచ్చేలా చేసింది. చెల్లుబోయిన వేణుగోపాల్ కోసం జగన్ తమ కుటుంబాన్ని నమ్ముకున్న పిల్లి సుభాష్ చంద్ర బోస్ ను మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అక్కడ బోస్ ఓటమి చెందినా ఎమ్యెల్సీ ని చేసి మంత్రిని చేసి తాజాగా రాజ్యసభకు పంపించారు. అలా బోస్ కి ఉన్నత స్థానం కల్పించడంతో బాటు వివాదరహితుడిగా పేరున్న చెల్లుబోయిన వేణుగోపాల్ కి క్యాబినెట్ లోకి ఆహ్వానించడం విశేషం.

Tags:    

Similar News