వైసీపీలో ఆ ఫ్యామిలీకి మరో ఫ్యామిలీ సెగ ?
ప్రకాశం వైసీపీలో గ్రూపుల గోలలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. అద్దంకి నియోజకవర్గానికి చెందిన బాచిన చెంచు గరటయ్య కుటుంబానికి చీరాల ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు.. కరణం [more]
;
ప్రకాశం వైసీపీలో గ్రూపుల గోలలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. అద్దంకి నియోజకవర్గానికి చెందిన బాచిన చెంచు గరటయ్య కుటుంబానికి చీరాల ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు.. కరణం [more]
ప్రకాశం వైసీపీలో గ్రూపుల గోలలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. అద్దంకి నియోజకవర్గానికి చెందిన బాచిన చెంచు గరటయ్య కుటుంబానికి చీరాల ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు.. కరణం బలరాం నుంచి సెగ బాగానే తగులుతోంది. వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుంచి టికెట్ ఆశిస్తున్న బాచిన వారసుడు. అద్దంకి వైసీపీ ఇన్‌చార్జ్ కృష్ణచైతన్య ఇటీవల కాలంలో దూకుడుగా ఉంటున్నారు. నిజానికి అద్దంకిలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి స్ట్రాంగ్‌గా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో లేకపోయినా.. రవి.. హవా జోరుగా సాగుతోంది. రవిని కట్టడి చేసేందుకు స్వయంగా జగనే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎలాగైనా గెలవాలని….?
గొట్టిపాటి కంచుకోట అద్దంకిలో వైసీపీని గెలిపించేందుకు బాచిన కృష్ణ చైతన్య బాగానే కష్టపడుతున్నారు. కానీ, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి.. తర్వాత వైసీపీలోకి వచ్చిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. కూడా అద్దంకి నియోజకవర్గంపై కన్నేశారు. ఆయన కుమారుడు వెంకటేష్‌ను ఇక్కడ నుంచి పోటీ చేయించాలన్నది ఆయన ప్రయత్నం. ప్రస్తుతం ఈ విషయం పార్టీ అధిష్టానం దగ్గర చర్చల్లో ఉంది. అయినప్పటికీ.. కరణం మాత్రం అటు చీరాల, ఇటు అద్దంకి రెండూ కూడా తమవేనని ప్రకటించుకుంటున్నారు. అంతేకాదు.. అద్దంకి వైసీపీ వ్యవహారాల్లోనూ నిత్యం వేలుపెడుతున్నారు.
కరణం వార్నింగ్ తో…
ఇటీవల కృష్ణచైతన్య పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. దీంతో పార్టీ తరఫున చాలా మందికి ఆహ్వానాలు పంపారు. ఇటీవల కృష్ణ చైతన్యకు నామినేటెడ్ పదవి కూడా రావడంతో హడావిడి చేయడంతో పాటు బల ప్రదర్శన చేయాలని భావించారు. అయితే ఈ కార్యక్రమానికి పార్టీ కీలక నేతలు.. అద్దంకి వైసీపీ నాయకులు డుమ్మా కొట్టారు. ఇది.. పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ కీలక నేతల డుమ్మా వెనుక కరణం బలరాం వర్గం హెచ్చరికలు ఉన్నాయని.. బాచిన ప్రోగ్రాంకు వెళ్తే..పర్యావసానాలు వేరేగా ఉంటాయని.. వార్నింగ్‌లు వచ్చినట్టు మ్యాటర్ బయటకు రావడంతో బాచిన వర్గం రుసరుసలాడుతోంది.
హైకమాండ్ దృష్టికి….
దీంతో ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని గరటయ్య నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. వివాద రహితులమైన తమ కుటుంబంపై కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్న కరణం బలరాం కుటుంబం రాజకీయాలు చేయాలని చూస్తోందని.. ఇలా అయితే.. ఎలా ? అంటూ.. బాచిన కుటుంబం కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లాకే చెందిన ఓ మంత్రి అండదండలతో కరణం ఫ్యామిలీ అద్దంకిలో కూడా వేలు పెడుతోన్న పరిస్థితి ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చాలంటూ.. నేడో రేపో.. బాచిన కుటుంబం హైకమాండ్ ను కలిసేందుకు రెడీ అవుతోంది.