ఆ ఎమ్మెల్యే సతీమణి.. ఆయనను మించిపోయారట
ఇప్పటి వరకు సోదరులు, బామ్మరుదులు, బావలు అయిపోయారు.. ఇక, సతీమణులు రంగంలోకి దిగారు. -ఇదీ తాజాగా వైసీపీలో జరుగుతున్న హాట్ టాపిక్. ఇంతకీ ఏమైంది ? అంటే [more]
ఇప్పటి వరకు సోదరులు, బామ్మరుదులు, బావలు అయిపోయారు.. ఇక, సతీమణులు రంగంలోకి దిగారు. -ఇదీ తాజాగా వైసీపీలో జరుగుతున్న హాట్ టాపిక్. ఇంతకీ ఏమైంది ? అంటే [more]
ఇప్పటి వరకు సోదరులు, బామ్మరుదులు, బావలు అయిపోయారు.. ఇక, సతీమణులు రంగంలోకి దిగారు. -ఇదీ తాజాగా వైసీపీలో జరుగుతున్న హాట్ టాపిక్. ఇంతకీ ఏమైంది ? అంటే కృష్ణాజిల్లాలోని ఓ కీలక ఎమ్మెల్యే సతీమణి తాజాగా జరిగిన సీఎం కార్యక్రమంలో అన్నీతానై వ్యవహరించారు. నిజానికి ఆమెకు ఎలాంటి అధికారిక పదవి లేదు. అయినా కూడా ఎమ్మెల్యేను మించిపోయారనే టాక్ వైసీపీలోనే వినిపిస్తుండడం గమనార్హం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ విషయంలోనూ ఇలానే అనేక గుసగుసలు.. వినిపించాయి. అయితే.. ఎప్పుడూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలా మాత్రం కనిపించలేదు.
అధికారిక కార్యక్రమంలో…..
కానీ, దీనిని తలదన్నేలా.. వైసీపీ ఎమ్మెల్యేగారి సతీమణి సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న కార్యక్రమంలోనే అన్నీ తానై వ్యవహరించడం.. దీనికి అధికారులు సైతం సహకరించడం.. ఏకంగా ముఖ్యమంత్రి సైతం ఏమీ మాట్లాడక పోవడం వంటివి చాలా ఆసక్తిగా మారాయి. విషయంలోకి వెళ్తే.. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో తాజాగా సీఎం జగన్ సమగ్ర భూసర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను ప్రొటోకాల్ ప్రకారం కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆయన సతీమణి విమల కూడా అధికారిక కార్యక్రమంలో ఒక చేయి కాదు.. ఏకంగా రెండు చేతులు వేసేశారని వైసీపీ నేతలే చెప్పుకొంటూ.. బుగ్గలు నొక్కుకుంటున్నారు.
వేదికపైనా….?
సదరు కార్యక్రమానికి సీఎం రాకముందు.. వేదికపై హల్‌చల్ చేసిన విమల.. అధికారులకు సైతం కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వాటిని వారు పాటించేశారు. ఇక, సీఎం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ప్రొటోకాల్ లేకపోయినా.. వేదికపై రెండో వరసలో సీఎం వెనుకే కూర్చున్నారు. అంతటితో ఆగలేదు.. కొన్ని నిముషాలకే ఓ అధికారి ప్రసంగించేందుకు ఫస్ట్ వరుసలో సీటు ఖాళీ చేయగానే.. వెంటనే అందులోకి వచ్చేసి కూర్చున్నారు. దీంతో సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి తన ప్రసంగం అయిపోయిన తర్వాత ఎక్కడ కూర్చోవాలో కూడా అర్ధంకాక దిక్కులు చూశారు.
ఇప్పుడే కాదు…గతంలోనూ…..
ఇక, సీఎం పుట్టిన రోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ ఇదే స్టేజ్‌పై ఆమె హల్ చల్ చేశారు. దీంతో ఇదే జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మరొకరు.. “ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. బహుశా.. ఆమెను కూడా రాజకీయాల్లోకి తెస్తున్నారేమో..“ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి వస్తారేమో .. చూడాలి.. అంటున్నారు మిగిలిన వారు ఏదేమైనా.. సామినేని సతీమణి.. హల్‌చల్ ఘటన వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. విమల ఇప్పుడు మాత్రమే కాదు .. గతంలోనూ వివాస్పదంగా వార్తల్లో నిలిచారు. గతంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులపై దురుసగా ప్రవర్తించారన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.