బ్రేకింగ్: ఇచ్చేశారుగా రిటర్న్ గిఫ్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన వికారాబాద్ లో ఎన్నికల [more]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన వికారాబాద్ లో ఎన్నికల [more]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన వికారాబాద్ లో ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ… ‘‘చంద్రబాబు ఇటీవల నన్ను దారుణంగా తిడుతున్నారు. హైదరాబాద్ కు శాపాలు పెడుతున్నారు. అసలు చంద్రబాబుకు ఏపీలో డిపాజిట్లు కూడా రావు. నా వద్ద తాజా సర్వే రిపోర్టు ఉంది. ప్రత్యేక హోదాకు నా మద్దతు ఇస్తానని జగన్ చెబితే చెవిలా చెప్పానా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వికారాబాద్ లో లక్షలాది మంది సాక్షిగా చెబుతున్నా… మేము బతకాలి, పక్కవాళ్లు కూడా సంతోషంగా బతకాలని తెలంగాణ ప్రజలం కోరుకుంటాం. చంద్రబాబు లాగా చీకటి పనులు మేము చేయము, చెవిలో చెప్పము. చంద్రబాబులా మందికి గోతులు మేము తియ్యం. కుట్రలు చెయ్యం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మా ఎంపీలు పార్లమెంటులో చెప్పారు. ఇప్పుడు నేను మరోసారి మా విధానం చెబుతున్నాం. తెలంగాణలో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలుస్తుంది. ఎంఐఎం ఒకటి గెలుస్తుంది. ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి మంచి విజయం సాధించనున్నారు. మొత్తం 35, 36 ఎంపీలము అవుతాము. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలకు మా 17 మంది ఎంపీల పూర్తి మద్దతు ఉంటుంది.’’ అని స్పష్టం చేశారు.
పోలవరం కట్టుకోవాలి…
‘‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా మేము పూర్తిగా సహకరిస్తాం. పోలవరం కట్టుకోవాలని మేము చెప్పాము. తెలంగాణను ముంచడాన్ని మాత్రం వద్దన్నాం. ఈ సంవత్సరం తెలంగాణ, ఏపీ వాడుకున్నాక గోదావరిలో 2600 టీఎంసీల నీళ్లు సముద్రంలో వృధాగా కలిసిపోయాయి. సముద్రంలో కలవడం కంటే మీరు గోదావరి నీరు వాడుకుంటే మాకేం అభ్యంతరం. మాకు ఉన్న వెయ్యి టీఎంసీల నీటిని మేము వాడుకుంటాం. ఆంధ్ర ప్రజలు మంచోళ్లు. వారితో మాకేమీ ఇబ్బంది లేదు. చంద్రబాబు లాంటి పది మంది కిరికిరిగాళ్లు ఉన్నారు. వాళ్లతోనే సమస్య. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా సంతోషంగా ఉండాలనేది మా ఆకాంక్ష.’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.