సెటిల్ మెంట్ తోనే స్టేట్ మెంట్

సీఎం రమేష్… మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత. తెలుగుదేశం పార్టీకి ఆర్థిక వనరులను సమకూర్చడంతో పాటు అభ్యర్థుల ఎంపికలోనూ కీలక పాత్ర [more]

Update: 2019-09-12 05:00 GMT

సీఎం రమేష్… మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత. తెలుగుదేశం పార్టీకి ఆర్థిక వనరులను సమకూర్చడంతో పాటు అభ్యర్థుల ఎంపికలోనూ కీలక పాత్ర పోషించిన నేత. ముఖ్యంగా కడప జిల్లాలను ఐదేళ్ల పాటు శాసించిన నేత సీఎం రమేష్. ఇంతకీ సీఎం రమేష్ పార్టీ మారడానికి చెప్పిన కారణాలు విని టీడీపీ నేతలే ఆశ్చర్య పోతున్నారు. సీఎం రమేష్ ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణం దేశంలో ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదట.

ఏపీ రాజకీయాలు తెలిసి….

ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేత. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆయనకు తెలియంది కాదు. గత కొన్ని దశాబ్దాలుగా మొన్నటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను శాసించింది తెలుగుదేశం పార్టీయే. ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ ఏపీని ఏలిన సంగతి ఆయనకు తెలియంది కాదు. తర్వాత ఎన్టీ రామారావు మరణం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా బలపడటంతో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగలిగింది. తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణలోనూ ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు పట్టం కట్టారు.

విడిపోయిన తర్వాత కూడా….

ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరో ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పవర్ ను చేజిక్కించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ దశాబ్దకాలంగా ప్రాంతీయ పార్టీలే రాజ్యమేలుతున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ఇక్కడ చోటు లేదు. అయితే సీఎం రమేష్ మాత్రం ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదని చెప్పడం వెనక కారణాలు వెతుక్కుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

జాతీయ పార్టీలు ఎక్కడ?

సీఎం రమేష్ ఎన్నికల ఫలితాల తర్వాతనే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయారు. ఆయన ఇప్పటి వరకూ ప్రత్యక్ష్య ఎన్నికల్లో గెలిచిన అనుభవమూ లేదు. తాను పార్టీని వీడటానికి కారణం చెప్పాలంటే టీడీపీపై నెపం మోపాలి. చంద్రబాబు విధానాలు నచ్చకనో, లేక తన కేసుల నుంచి తనను తాను రక్షించుకోవడానికనో్ వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. టీడీపీపై నింద మోపడం ఇష్టం లేని సీఎం రమేష్ ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదని స్టేట్ మెంట్ పారేశారు. పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడుల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. ఏపీని చూసుకుంటే అక్కడ జాతీయ పార్టీ కాంగ్రెస్ కు చోటు లేకుండా పోయింది. బీజేపీ కోలుకునే అవకాశమూ లేదు. మరి సీఎం రమేష్ ఈ స్టేట్ మెంట్ ఎందుకిచ్చినట్లో… ఆయనకే తెలియాలి.

Tags:    

Similar News