అంటుకోవడానికి కారణం అదేనా?

తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలైపోయిందన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తం అవుతుంది. తెలంగాణాలోని సూర్యాపేట జిల్లాలోనూ, ఏపీ లో విజయవాడలో కొన్ని కేసుల్లో ఈ వ్యవహారం దర్యాప్తులో [more]

Update: 2020-04-23 11:00 GMT

తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలైపోయిందన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తం అవుతుంది. తెలంగాణాలోని సూర్యాపేట జిల్లాలోనూ, ఏపీ లో విజయవాడలో కొన్ని కేసుల్లో ఈ వ్యవహారం దర్యాప్తులో బయటపడింది. రైతు బజార్ లో కరోనాను తగిలించుకు వచ్చినట్లు బాధితులు స్పష్టం చేయడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి అనుసరించాలిసిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. రైతు బజార్లలో ఎవరి ద్వారా సోకిందన్నది మిస్టరీ గా ఉంది. దాంతో ఇప్పుడు ఫోకస్ దీనిపై పెట్టాయి ఆయా సర్కార్ లు.

మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నా ….

ఇప్పటికే మొబైల్ రైతు బజార్లను తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. అయితే ఇక్కడ కూడా ప్రజలు సామాజిక దూరం పాటించకుండా తమ వద్దకు వచ్చే వాహనాలపై ఎగబడుతున్నారు. ఒక పక్క వైరస్ విజృంభిస్తున్నా ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి కొంప ముంచుతుంది. అదే విధంగా ప్రజలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసేందుకు వచ్చే నేతలు, స్వచ్ఛంద సంస్థల దగ్గర ఇదే తంతు. ముందుగా వెళ్లకపోతే తమకు అందకుండా పోతుందేమో అన్న ఆత్రుత వైరస్ వ్యాప్తికి కారణం అయ్యేలా ఉంది.

సేవా కార్యక్రమాలతోనూ….

దీంతో ఉచితంగా పంపిణీ చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన తెచ్చారు. అయినా కానీ నిత్యావసరాలు, కూరగాయల కోసం కుళాయి కొట్లాటలు తెలుగు రాష్ట్రాల్లో భయం పుట్టిస్తున్నాయి. దాంతో కొందరు కూపన్లు పంపిణీ చేసి ఇంటివద్దే వాటిని అందజేసే కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇది కొంతమేరకు మంచి ఫలితాలే ఇస్తుంది. మొత్తం మీద రైతు బజార్ల నుంచి ఈ వ్యాధి సోకిందన్నది ఆందోళన కల్గించే అంశమే.

Tags:    

Similar News