తూ.గోలో కలకలం రేపిన కరోనా
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కలకలం రేపింది. లండన్ నుంచి వచ్చిన ఒక యువకుడు గృహప్రవేశ కార్యక్రమానికి ఇంటికి వచ్చాడు. [more]
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కలకలం రేపింది. లండన్ నుంచి వచ్చిన ఒక యువకుడు గృహప్రవేశ కార్యక్రమానికి ఇంటికి వచ్చాడు. [more]
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కలకలం రేపింది. లండన్ నుంచి వచ్చిన ఒక యువకుడు గృహప్రవేశ కార్యక్రమానికి ఇంటికి వచ్చాడు. గత పదిరోజుల క్రితమే అతను రాజమండ్రి వచ్చినా వ్యాధి తీవ్రత ముదిరి తాజాగా లక్షాణాలు బయటపడటంతో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి పరీక్షించారు. ఈ పరీక్షలలో పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది. ఆ వ్యక్తి తో గడిపిన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే అతడితో గడిపిన వారి వివరాలు లండన్ నుంచి వచ్చిన ప్రయాణ వివరాలను ఎవరెవరిని కలిసింది విచారణ చేస్తున్నారు.
అప్రమత్తం అయిన యంత్రాంగం …
దీంతో ఈనెల చివరి వరకు రాజమండ్రిలో నిత్యావసర వస్తువుల విక్రయాలు తప్ప అన్ని షాపులను కమిషనర్ అభిషేక్ కిశోర్ మూసివేయాలని ఆదేశించారు. ఇప్పటికే నగరంలో సినిమా థియేటర్లను ఎగ్జిబిటర్లు మూసివేశారు. స్కూల్స్ మూతపడ్డాయి. పార్క్ లు బహిరంగ ప్రదేశాల్లో నిషేధ ఆజ్ఞలు అమల్లో పెట్టారు. తాజాగా మరిన్ని జనసమ్మర్థ ప్రాంతాలను మూసివేయించారు. అలాగే మక్కా నుంచి వచ్చి విశాఖలో పాజిటివ్ కేసు నమోదు అయిన చనిపోయిన వ్యక్తి అంతకుముందు గౌతమీ ఎక్స్ ప్రెస్ భోగిలో ప్రయాణించిన వారి వివరాలు సేకరణలో యంత్రాంగం నిమగ్నం అయ్యింది. వీరిలో కొందరు రాజమండ్రి, సామర్లకోట లలో దిగడంతో వారు ఎవరు ఎక్కడికి వెళ్లారనే దానిపై ఫోకస్ పెంచారు అధికారులు.