గ్రామీణం వైపు దూసుకొస్తున్న మహమ్మారి.. అదే జరిగితే?

భారత్ లో కరోనా మహమ్మారి సాంద్రత ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువే. దీనికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలకు కరోనా పెద్దగా వ్యాప్తి చెందకుండా ఉండటమే అన్నది [more]

Update: 2020-05-23 18:29 GMT

భారత్ లో కరోనా మహమ్మారి సాంద్రత ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువే. దీనికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలకు కరోనా పెద్దగా వ్యాప్తి చెందకుండా ఉండటమే అన్నది నిపుణుల అభిప్రాయం. ముంబయి, చెన్నై, ఢిల్లీ, వంటి మహానగరాల్లో వైరస్ విజృంభిస్తున్నా గ్రామాల్లో నిన్న మొన్నటివరకు పల్లె సీమలు సురక్షితంగానే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని మోడీ సైతం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పదేపదే హెచ్చరించింది కూడా ఇదే. గ్రామాలు సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

వలస కూలీలు, కోయంబేడు …

అయితే దేశంలో మర్కజ్ ప్రార్థనల తరువాత వైరస్ వ్యాప్తిలో కీలక పాత్ర తమిళనాడు లోని కోయంబేడు మార్కెట్ ప్రధానంగా మారింది. అలాగే వలస కూలీలు సొంత గ్రామాలకు చేరుకుంటు ఉండటంతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇక నిత్యావసరాలు ఇతర రవాణా రంగంలో ఉండేవారు ఇతర రాష్ట్రాలు ప్రాంతాలకు వెళ్ళే డ్రైవర్లు కరోనా క్యారియర్లు అవుతున్నారు. కూలీలు మహానగరాలనుంచి వలస రావడంతో అక్కడ తగులుకున్న వైరస్ ను వారి గ్రామాలకు తరలిస్తున్నారు. ఇదే ఇప్పుడు దేశంలోని రాష్ట్రాలను వణికిస్తోంది.

పటిష్ట చర్యలు తీసుకోవాలి …

ఇప్పటివరకు సురక్షితంగా ఉన్నాయనుకున్న గ్రామీణ భారతం వైరస్ రక్కసికి చిక్కితే అనేక సమస్యలు మొదలు కానున్నాయి. దేశానికి అవసరమైన ఆహార ఉత్పత్తులు, పాలు, పెరుగు, కూరగాయలు మొదలు కొని ఇక్కడినుంచే నగరాలు పట్టణాలకు రావాలిసిఉంటుంది. దాంతో గ్రామీణ ప్రాంతాల రక్షణే దేశానికి శ్రీరామ రక్ష అనే చెప్పొచ్చు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు కేసులు లేని అనపర్తి నియోజకవర్గంలో ఎనిమిది కేసులు రావడం, కోనసీమ లో కోయంబేడు కేసులు గ్రామాలకు కరోనా వ్యాప్తి వేగంగా వెళుతుందన్నది చెప్పకనే చెబుతున్నాయి. తక్షణం ప్రభుత్వాలు వైరస్ కట్టడి మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చేయకపోతే ఇక్కట్లు అందరికి తప్పేలా లేవు.

Tags:    

Similar News