మోడీ ధోని లా హెలికాఫ్టర్ షాట్ కొడతారా ?

క్రికెట్ లో హెలికాఫ్టర్ షాట్ పేరు చెప్పగానే మహేంద్రసింగ్ ధోని టక్కున గుర్తొస్తాడు. ఆ షాట్ కి ట్రేడ్ మార్క్ గా ధోని మారిపోయాడు కూడా. ఎన్నో [more]

Update: 2020-04-13 06:30 GMT

క్రికెట్ లో హెలికాఫ్టర్ షాట్ పేరు చెప్పగానే మహేంద్రసింగ్ ధోని టక్కున గుర్తొస్తాడు. ఆ షాట్ కి ట్రేడ్ మార్క్ గా ధోని మారిపోయాడు కూడా. ఎన్నో మ్యాచ్ లను ధోనీ తన అమ్ములపొదిలోని ఈ షాట్ కొట్టి సిక్సర్ల వర్షం కురిపించి ఒంటిచేత్తో గెలిపించాడు. ఇప్పుడు భారత కరోనా వైరస్ దెబ్బకు ఆర్థికరంగం పూర్తిగా డీలా పడి గిలగిలలాడుతోంది. దీనినుంచి దేశాన్ని రక్షించాలంటే ప్రధాని మోడీ కూడా హెలికాఫ్టర్ మనీ విడుదల చేయాలన్న డిమాండ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఏమిటీ? హెలికాఫ్టర్ మనీ …

ఆర్ధిక సంక్షోభాలనుంచి గట్టెక్కేందుకు ప్రపంచం అనుసరిస్తున్న క్వాంటిటీ ఈజింగ్ పద్ధతి అనుసరిస్తుంది. దీనినే హెలికాఫ్టర్ మనీ అని కూడా పిలుస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ క్యూ ఈ విధానమే దేశానికి రక్ష అనే డిమాండ్ ప్రధాని మోడీ ముందు ఇప్పటికే పెట్టారు. అమెరికా, జపాన్ వంటి దేశాలు అనుసరించి తమ సమస్యలు నుంచి గట్టెక్కాయి. రెండువందల మూడు లక్షల కోట్ల రూపాయలు జిడిపి లెక్క చెబుతుంది కనుక అందులో ఐదు శాతం క్యూ ఈ కింద రిజర్వ్ బ్యాంక్ ద్వారా డబ్బు ముద్రించి అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిపుష్టికి చర్యలు చేపట్టాలన్న డిమాండ్ ను ఆమోదించి మోడీ హెలికాఫ్టర్ మనీ పెంచితే కొన్ని సమస్యలు పొంచి ఉన్నాయి. ఆర్ధిక అభివృధ్ధికోసం ఈ డబ్బును ఖర్చు పెట్టే విధానం మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సంపన్న వర్గాలకు, పరిశ్రమలకు రాయితీల రూపంలో ఈ సొమ్ము వెదజల్లితే మాత్రం ఆర్ధిక వ్యవస్థ కుదేలు కానుంది.

ఆచితూచి అడుగులు వేయాలిసిందే …

అలాగే అసలే మాంద్యం ముంగిట ఉన్నందున డబ్బు ఎంత ఉన్నా వస్తువుల ధరలు చుక్కల్లో చేరతాయన్న లెక్కలు చెబుతున్నాయి. అలా కాకుండా ఆర్ధిక మందగమనం లేకుండా ఎకానమీ లో ప్రొడక్షన్ క్రియేట్ చేయాలి అంటే సామాన్యులకు అందిస్తే మాత్రం ప్రస్తుత గండం నుంచి గట్టెక్కుతుందని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని కేంద్ర రాష్ట్రప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఖజానా లు ఖాళీగా దర్శనమిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. దాంతో అన్ని వైపులా ఆదాయ దారులు మూసుకుపోతూ కిం కర్తవ్యం అన్నది ప్రధానిని సవాల్ విసురుతుంది. ఈ నేపథ్యంలో మోడీ అతి కీలకమైన ఈ అవకాశాన్ని వినియోగిస్తారు లేక మరో వ్యూహంతో ముందుకు వెళతారా అన్నది ఆసక్తికరం గా మారింది

Tags:    

Similar News