బాంబు పేల్చారుగా.. ఇలా అయితే ఎలా?

ఇప్పటివరకు కరోనా గాలి ద్వారా సోకదనే వాదనే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పుకొచ్చింది. దాంతో అంతా భౌతిక దూరం, మాస్క్ లు ధరించడం, చేతులు శుభ్రపరుచుకోవడం వంటి [more]

Update: 2020-07-09 18:29 GMT

ఇప్పటివరకు కరోనా గాలి ద్వారా సోకదనే వాదనే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పుకొచ్చింది. దాంతో అంతా భౌతిక దూరం, మాస్క్ లు ధరించడం, చేతులు శుభ్రపరుచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుని అత్యవసర పనులు పూర్తి చేసుకుంటున్నారు. వైరస్ తో సహజీవనం తప్పదన్న లెక్కల్లోకి ఇప్పుడు అంతా వచ్చేశారు. పని చేయకపోతే జీవనం గడవని పరిస్థితుల్లో ఇప్పుడు ఇంట్లో దాక్కుని యుద్ధం చేసే ఓపిక కూడా అందరిలో నశించింది. ఆర్ధిక అవసరాలు సైతం ఉద్యోగులు, వ్యాపారులను రోడ్డెక్కించేలా చేసింది. ఈ నేపథ్యంలో వైరస్ పై పరిశోధనలు చేసిన కొన్ని దేశాలకు చెందిన వైద్యులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక లేఖ రాశాయి.

గాలికి వ్యాప్తి చెందుతుంది…

వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతున్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని ప్రముఖ వైద్యులు రాసిన లేఖను ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చేసింది. తొలుత అలా రాదన్న ఆ సంస్థ ఇప్పుడు మాట మార్చింది. గాలి ద్వారా కూడా సోకే ప్రమాదం లేకపోలేదని తేల్చింది. అయితే దీనిపై మరింత లోతైన పరిశోధనలు జరగాలిసి ఉందని పేర్కొంది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించే ఇంటా బయటా ఉండాలిసిందే నని స్పష్టం చేసింది. గాలి వెలుతురూ ధారాళంగా ఉండే చోట సంచరించాలని క్లోజ్డ్ గా ఉండే ప్రాంతాల్లో వైరస్ విజృంభిస్తుందని చెప్పింది. అంతేకాదు వైరస్ సుమారు 8 గంటల పాటు గాల్లో ఉంటుందని అంటుంది.

మరింత జాగ్రత్తగా వైద్యం అందించాలి …

దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైద్య విధానం కూడా సమూలంగా మారనుంది. ఇప్పటివరకు పీపీఈ కిట్లు ధరించి చికిత్స అందిస్తున్న వైద్యులు ఇకపై మరిన్ని రక్షణలు తీసుకోవాలిసి ఉంది. ప్రజలు భయాందోళనకు గురి అవుతారనే ఈ సత్యాన్ని డబ్ల్యు హెచ్ ఓ దాచిపెడుతుందన్న విమర్శల నేపథ్యంలో గాల్లో వైరస్ వ్యాప్తిని కొట్టి పాడేయలేమని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెప్పక తప్పలేదు. ఈ నేపథ్యంలో ఇకపై బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వారు తప్పని సరిగా సురక్షిత చర్యలు పాటించకతప్పదు. నిర్లక్ష్యం మీతో బాటు మీ కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని కాటేస్తుందని గుర్తు పెట్టుకొని మసలు కోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఇంట్లో నే ఉండండి … క్షేమంగా ఉండండి.

Tags:    

Similar News